NTV Telugu Site icon

Nothing Phone 2a Plus Launch: ‘నథింగ్‌’ నుంచి కొత్త ఫోన్‌.. 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ, 50 ఎంపీ సెల్ఫీ కెమెరా!

Nothing Phone 2a Plus

Nothing Phone 2a Plus

Nothing Phone 2a Plus 5G Smartphone Launch and Price in India: వన్‌ప్లస్‌ సహ వ్యవస్థాపకుడైన కార్ల్‌ పై స్థాపించిన బ్రాండే ‘నథింగ్‌’. ఇప్పటివరకు లాంచ్‌ చేసినవి కొన్ని స్మార్ట్‌ఫోన్‌లే అయినా ఈ కంపెనీకి కావాల్సినంత ప్రచారం దక్కింది. ట్రాన్సపరెంట్‌ లుక్‌లో వచ్చిన నథింగ్‌ ఫోన్‌ 1, నథింగ్‌ ఫోన్‌ 2, నథింగ్‌ ఫోన్‌ 2ఏలు మంచి మార్కులు కొట్టేశాయి. నథింగ్‌ ఫోన్‌ 2ఏకు కొనసాగింపుగా.. ‘నథింగ్‌ ఫోన్‌ 2ఏ ప్లస్‌’ను కంపెనీ భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. ఆకర్షణీయమైన డిజైన్‌, సూపర్ ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది.

Nothing Phone 2a Price:
నథింగ్‌ ఫోన్‌ 2ఏ ప్లస్‌ ఫోన్‌ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.27,999గా.. 12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.29,999గా కంపెనీ నిర్ణయించింది. బ్లాక్‌, గ్రే రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. జులై 31న నథింగ్‌ ఫోన్‌ 2ఏ ప్లస్‌ లాంచ్ కాగా.. ఆగస్టు 7 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ప్రీ బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. ప్రారంభ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Nothing Phone 2a Specigications:
నథింగ్‌ ఫోన్‌ 2ఏ ప్లస్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత నథింగ్‌ ఓఎస్‌ 2.6తో వస్తోంది. 6.67 ఇంచెస్ ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్‌ రేటు కలిగి ఉంటుంది. ఆక్టాకోర్‌ 4ఎన్ఎం మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 7350 ప్రో 5జీ ప్రాసెసర్‌ను అమర్చారు. నథింగ్‌ 2ఏ ప్లస్‌లో మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఇచ్చారు. ఐపీ54 రేటింగ్‌తో ఈ ఫోన్ వస్తోంది.

Also Read: Delhi Rains: ఢిల్లీలో భారీ వర్షం.. గంట వ్యవధిలో 11 సెంమీ వాన! స్కూళ్లకు సెలవు

Nothing Phone 2a Camera and Battery:
నథింగ్‌ ఫోన్‌ 2ఏ ప్లస్‌ వెనకవైపు 50ఎంపీ శాంసంగ్‌ జీఎన్‌9 సెన్సర్‌ ఉంటుంది. ఇది ఓఐఎస్‌, ఈఐఎస్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 50 ఎంపీ శాంసంగ్‌ జేఎన్‌1 సెన్సర్‌ కూడా ఇచ్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50ఎంపీ కెమెరా ఇచ్చారు. 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌.. 50 వాట్స్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. సింగిల్‌ ఛార్జ్‌తో 40 గంటలు మ్యూజిక్‌ ప్లేబ్లాక్‌ టైం వస్తుందని కంపెనీ పేర్కొంది.