Site icon NTV Telugu

No Kings Protest in USA: అమెరికాలో టెన్షన్.. టెన్షన్.. ట్రంప్‌కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన లక్షలాది మంది..!

Usa

Usa

No Kings Protest in USA: అమెరికాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అధ్యక్షుడు ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 50 రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా వాషింగ్టన్ డీసీ నుంచి లండన్ వరకు మొత్తం 50 నగరాల్లో ఈ భారీ నిరసనలు జరిగాయి. ఈ నిరసనలలో లక్షలాది మంది పాల్గొన్నారు. ఈ నిరసనకు ‘నో కింగ్స్’ అని పేరు పెట్టారు. ఈ నిరసన సందర్భంగా ట్రంప్ వలస, విద్య, భద్రతా విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 2600 కంటే ఎక్కువ ప్రాంతాత్లో నో కింగ్స్ ప్రదర్శనలు జరుగుతున్నాయి. అమెరికా, లండన్, స్పెయిన్‌లోని మాడ్రిడ్, బార్సిలోనాలో ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. ఆయా దేశాల రాయబారా కార్యాలయాల బయట పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. వాషింగ్టన్ ప్రదర్శన సందర్భంగా, నిరసనకారులు వివిధ రకాల దుస్తులు ధరించి, బ్యానర్‌లను పట్టుకుని పెన్సిల్వేనియా అవెన్యూలో కవాతు చేశారు. 300 కంటే ఎక్కువ స్థానిక సంస్థలు ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చారు.

READ MORE: గేమింగ్ ఫోన్లలో గేమ్‌చేంజర్ ఆగయా.. REDMAGIC 11 Pro, 11 Pro+ లాంచ్..!

నిజానికి, అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కేవలం 10 నెలల్లోనే, వలస పరిమితులను కఠినతరం చేశారు. పాలస్తీనా అనుకూల నిరసనలు, వైవిధ్య విధానాలపై విశ్వవిద్యాలయాలకు సమాఖ్య నిధులను తగ్గిస్తామని బెదిరించారు. అనేక రాష్ట్రాలకు నేషనల్ గార్డ్ దళాలను మోహరించడానికి అధికారం ఇచ్చారు. ట్రంప్ పరిపాలన చర్యలు సామాజిక విభజనలను తీవ్రతరం చేశాయని, ప్రజాస్వామ్య నిబంధనలను తుంగలో తొక్కారని విమర్శకులు అంటున్నారు. అయితే.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరసనలపై బహిరంగంగా వ్యాఖ్యానించలేదు. అయితే, ఫాక్స్ బిజినెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిరసనకారులను ఉద్దేశించి “వారు నన్ను రాజు అని పిలుస్తున్నారు, కానీ నేను రాజును కాదు” అని వ్యాఖ్యానించారు. మరోవైపు.. శాసనసభ ప్రతిష్టంభన మధ్య ప్రభుత్వ షట్‌డౌన్ మూడవ వారంలోకి కొనసాగుతోంది.

Exit mobile version