నిజమాబాద్ జిల్లా సిరికొండ మండలం కోమన్ పల్లి గ్రామంలో వింత ఘటన చేసుకుంది. భార్యపై అలిగిన భర్త ఊళ్లోని కరెంట్ పోల్ ఎక్కి హంగామా చేశాడు. తాగిన మత్తులో భర్త కరెంట్ పోల్ మీదనే ఉండి రెండు గంటల పాటు హంగామా చేశాడు. పోలీసుల రంగ ప్రవేశంతో అతడు కిందకు దిగాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీటెయిల్స్ ఇలా ఉన్నాయి…
కోమన్ పల్లి గ్రామంకు చెందిన సుమన్ అనే వ్యక్తి మద్యం మత్తులో భార్యతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ కారణంగా సుమన్‌కు అతడి భార్య భోజనం పెట్టలేదు. దాంతో తన భార్యపై అతడు అలకబూనాడు. భార్యపై అలిగిన సుమన్.. మద్యం సేవించాడు. మద్యం మత్తులో సుమన్ గ్రామం చివరలో ఉన్న కరెంట్ పోల్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
భార్య, స్థానికులు ఎంత చెప్పినా సుమన్ కరెంట్ పోల్ మీది నుంచి కిందకు దిగలేదు. ఎవరైనా పైకి వస్తే తాను దూకుతా అంటూ బెదిరించాడు. కరెంట్ పోల్ మీదే ఉండి రెండు గంటల పాటు హంగామా చేశాడు. దాంతో పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. పోలీసుల సహాయంతో గ్రామస్థులు సుమన్‌కు నచ్చ చెప్పి కిందికి దించారు. దాంతో అతడి భార్య ఊపిరిపీల్చుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
