NTV Telugu Site icon

Nita Ambani : నీతా అంబానీ లాంగ్‌ నెక్లెస్‌ ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే..

Nita Ambani (3)

Nita Ambani (3)

ప్రముఖ వ్యాపార వేత్త రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ తన చిన్నకుమారుడు అనంత్‌ అంబానీ పెళ్లిలో చాలా ప్రత్యేకంగా నిలిచారు. స్వయంగా డ్యాన్సర్‌ అయిన ఆమె అంబానీ కుటుంబవేడుకల్లో తన డ్యాన్స్‌ పెర్ఫార్మన్స్ తో అందరిని ఆకట్టుకుంది.. నీతా అంబానీ ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుంది..ఇక ఇప్పుడు కూడా లుక్స్, ఫ్యాషన్‌తో అతిథులను సర్‌ప్రైజ్‌ చేశారు. ముఖ్యంగా నీతా ధరించిన ఖరీదైన డైమండ్ నెక్లెస్ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది..

ఖరీదైన కాంచీపురం చీరలో డైమండ్ నెక్లేస్ లో చాలా హుందాగా కనిపిస్తుంది.. బోర్డర్‌పై క్లాసిక్ ట్రెడిషనల్ జర్దోసీ వర్క్, బ్లౌజ్‌ స్లీవ్‌లపై ప్రత్యేకమైన గోటా వర్క్‌, చక్కటి మేకప్‌తో తన ఐకానిక్‌ సిగ్నేచర్ స్టయిలో మెరిసిపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె డైమండ్ నెక్లేస్ ధర పై పెద్ద చర్చ జరుగుతుంది.. పచ్చలు పొదిగిన, పొడవాటి నెక్లెస్‌లో ఆమె లుక్‌తో అతిథులు చూపు తిప్పుకోలేక పోయారంటే అతిశయోక్తి కాదు. దీనికి సరిపోయేలా చెవిపోగులు, బ్యాంగిల్స్ , వేలి రింగ్‌ ఆకట్టుకున్నాయి…

అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ పచ్చ రంగు డైమండ్ నెక్లేస్ ధర దాదాపు 500 కోట్లు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా నిర్వహించిన కాక్‌టెయిల్ నైట్‌ ఈవెంట్‌లో వైన్ కలర్‌ కస్టమ్-మేడ్ గౌను, క్లాసిక్ ఫ్రెంచ్ ట్విస్ట్ బన్‌లో అదిరిపోయే లుక్ లో కనిపించారు.. అనంత్ అంబానీ, రాధికా మార్చంట్ పెళ్లి వేడుకకు 1000 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లు సమాచారం..

Show comments