Site icon NTV Telugu

Hyderabad: కల్తీ కల్లు బాధితులు హెల్త్ బులిటెన్ విడుదల.. సంచలన విషయాలు వెల్లడి..

Hyd

Hyd

కల్తీకల్లు కారణంగా చికిత్స పొందుతున్న బాధితుల హెల్త్ బులిటెన్‌ను నిమ్స్ వైద్యులు విడుదల చేశారు. చికిత్స పొందుతున్న వారిలో కిడ్నీ బాధితులు సంఖ్య పెరుగుతోందని.. కిడ్నీ పని చేయని వారి సంఖ్య 9 మందికి చేరిందని తెలిపారు. మరో ఇద్దరు బాధితులకు కూడా డయాలసిస్ చేయాల్సి పరిస్థితి ఉన్నట్లు వెల్లడించారు. చికిత్స పొందుతున్న వారిలో 11 మంది ఆరోగ్యంగా నిలకడగా ఉన్నట్లు వైద్యలు వెల్లడించారు. ఇంకో 12 మందిని అబ్జర్వేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని బులిటెన్లో పేర్కొన్నారు..

READ MORE: Indian Railways: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇకపై ఆ ఇబ్బంది ఉండదు

కాగా.. కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో బాధితుల సంఖ్య 44కి చేరింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నిన్న(గురువారం) తెలిపారు. ప్రస్తుతం నిమ్స్‌లో 31 మంది, గాంధీ ఆస్పత్రిలో ఆరుగురు చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మరో ఏడుగురికి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం కూకట్‌పల్లి పరిధిలోని పలు కల్లు కాంపౌండ్‌లలో కల్తీకల్లు తాగి పలువురు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

READ MORE: Brian Lara: ముల్డర్‌.. త్యాగం అసవరం లేదు, ఈసారి 400 కొట్టేయ్: లారా

Exit mobile version