Site icon NTV Telugu

Cyprus President: సైప్రస్ తదుపరి అధ్యక్షుడిగా నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఎన్నిక

Cyprus President

Cyprus President

Cyprus President:: సైప్రస్ తదుపరి అధ్యక్షుడిగా మాజీ విదేశాంగ మంత్రి నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఆదివారం ఎన్నికయ్యారు. ఆయన తన దౌత్య, విదేశాంగ విధాన దృష్టితో సైప్రస్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రాధాన్యతలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. విభజించబడిన మధ్యధరా ద్వీపంలో 49 ఏళ్ల క్రిస్టోడౌలిడెస్ 51.9 శాతం ఓట్లతో తోటి దౌత్యవేత్త ఆండ్రియాస్ మావ్రోయినిస్‌ను ఓడించారని అల్ జజీరా నివేదించింది. ఆండ్రియాస్ మావ్రోయినిస్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ రాత్రి ఒక ప్రయాణం ముగిసిందని, తాను వేలాది మంది వ్యక్తులతో పంచుకున్న గొప్ప ప్రయాణం ముగిసిందన్నారు. సైప్రస్‌లో అవసరమైన మార్పును సాధించలేకపోయామని చింతిస్తున్నానన్నారు. క్రిస్టోడౌలిడెస్‌ ప్రచారం సమయంలో ద్వీపంలోని దశాబ్దాల నాటి విభజనను అంతం చేయడంపై ఐక్యరాజ్యసమితి మద్దతుతో చర్చలపై కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని అల్ జజీరా నివేదించింది.

Turkey Earthquake: టర్కీలో మరోసారి భూకంపం.. ఇప్పటికే 34 వేలు దాటిన మృతుల సంఖ్య

అధ్యక్షుడిగా ఎన్నికైన క్రిస్టోడౌలిడెస్‌కు సైప్రస్‌లోని బ్రిటీష్ హైకమిషనర్‌ ఇర్ఫాన్‌ సిద్ధిక్‌ ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 405,000 కంటే ఎక్కువ మంది పౌరులు ఓటు వేయడంతో 72.4 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ ఓటింగ్‌లో క్రిస్టోడౌలిడెస్‌కు అత్యధిక ఓట్లు సాధించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సైప్రస్‌లో దక్షిణాన ఉన్న గ్రీకు సైప్రియట్‌లు, ఉత్తరాన ఉన్న టర్కిష్ సైప్రియట్‌ల మధ్య వివాదం కొనసాగుతోంది. అమెరికన్ బ్రాడ్‌కాస్టర్ వాయిస్ ఆఫ్ అమెరికా (VOA) ఇటీవలి నివేదిక ప్రకారం, విభజించబడిన సైప్రస్ ద్వీపంపై గ్రీస్, టర్కీల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా, సైప్రస్‌లోని ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళం (UNFICYP) ఆదేశం ప్రకారం, 1974 నుండి మధ్యధరా ద్వీపంఉత్తర, దక్షిణ ప్రాంతాలలో గ్రీక్, టర్కిష్ కమ్యూనిటీలను వేరుచేసే బఫర్ జోన్‌లో అనధికార కార్యకలాపాలపై భద్రతా మండలి ఆందోళన వ్యక్తం చేసింది.

Exit mobile version