Site icon NTV Telugu

Nikitha M*urder Case: ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదు.. నిఖిత కుటుంబ సభ్యుల ఆవేదన..!

Nikitha

Nikitha

Nikitha M*urder Case: అమెరికాలోని మేరీల్యాండ్‌లో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన గోడిశాల నిఖిత హత్య ఘటన కుటుంబ సభ్యులను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. డబ్బులు ఇస్తానని చెప్పి పిలిపించుకుని, ఆర్థిక వివాదాల నేపథ్యంలో అర్జున్ శర్మ అత్యంత కిరాతకంగా నిఖితను హతమార్చాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డిసెంబర్ 31న డబ్బులు కావాలంటూ అర్జున్ శర్మ ఫోన్ చేయడంతో నిఖిత అక్కడికి వెళ్లిందని, ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగి ఆర్థిక ఇబ్బందులే ఈ హత్యకు కారణమై ఉంటాయని వారు భావిస్తున్నారు. హత్య అనంతరం అర్జున్ శర్మ అక్కడి నుంచి పరారై భారత్‌కు వచ్చాడని తెలిసిందని నికిత తండ్రి తెలిపారు.

ONGC Gas: మంటలను వెంటనే అదుపులోకి తీసుకరండి.. గ్యాస్ లీకేజీపై సీఎం ఆరా..!

ఈ ఘటనపై భారత రాయబారి ద్వారా సమాచారం అందిందని, మృతదేహాన్ని అత్యంత త్వరగా అన్ని ప్రక్రియలు పూర్తి చేసి హైదరాబాద్‌కు తరలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. అలాగే నిందితుడైన అర్జున్ శర్మకు కఠిన శిక్ష విధించి, ఇకపై ఎలాంటి తల్లిదండ్రులకు ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని నిఖిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ వేగవంతం చేసి న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

CM Chandrababu Counter: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్..!

Exit mobile version