Site icon NTV Telugu

Nidhi Agarwal: ఈసారి ఏం పూజలు చేసారో.. మరోసారి వేణు స్వామి ఆధ్వరంలో ప్రత్యేక పూజలు చేసిన ముద్దుగుమ్మ..!

Nidhi Agarwal

Nidhi Agarwal

Nidhi Agarwal: తెలుగు చిత్రపరిశ్రమలో తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిధి అగర్వాల్ ఇప్పుడు మరోసారి వేణు స్వామి పూజల కారణంగా వార్తల్లో నిలిచింది. మోడలింగ్ రంగం నుంచి టాలీవుడ్‌కు వచ్చిన ఈ ముద్దుగుమ్మ “ఇస్మార్ట్ శంకర్” సినిమాతో పాపులారిటీ సాధించి, ప్రస్తుతం టాప్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ కెరీర్‌లో ముందుకు తీసుకెళ్తోంది.

విడుదలకు సిద్దమైన సినిమా, పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమాతో పాటు.. ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ మూవీలోనూ నిధి కథానాయికగా నటించింది. ఈ రెండు ప్రాజెక్టులు షూటింగ్ పూర్తయినా విడుదల విషయంలో కొంత ఆలస్యం జరుగుతోంది. ప్రత్యేకంగా ‘హరిహర వీరమల్లు’ జూలై 24న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుండడంతో, నిధి ఈ సినిమాకు మంచి విజయం కలగాలనే ఉద్దేశంతో ఇటీవల తిరిగి వేణు స్వామిని కలిసినాట్లు సమాచారం.

Read Also:Kerala: నలభై ఏళ్ల క్రితం రెండు హత్యలు.. ఆ రహస్యాన్ని దాచిపెట్టి బతకలేనంటూ..

ఇకపోతే తాజాగా వేణు స్వామి‌ నేతృత్వంలో హీరోయిన్ నిధి పూజలు చేయించుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలోనూ ఆవిడ వేణు స్వామిని సంప్రదించినట్టు, ఆ తర్వాత ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. ఈసారి కూడా అదే ఆశతో ఆమె ప్రత్యేక పూజలు చేయించుకున్నట్లు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే రష్మిక మందన్నా, డింపుల్ హయతి, అషు రెడ్డి వంటి తారలు వేణు స్వామిని కలిసినట్లు మీడియాలో వెల్లడైన సంగతి తెలిసిందే.

Read Also:Shubman Gill: ‘నన్ను నమ్ము’.. సిరాజ్ కు గిల్ సూచన.. ఆ ప్లాన్ అమలు చేసిన వెంటనే..?

అయితే ఇదివరకు కొందరిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సైలెంట్ గా ఉన్న వేణు స్వామి దగ్గరికి మళ్లీ ఇలా ఆయన చుట్టూ సినీ తారలు క్యూ కడుతుండటంతో, ఆయనపై సోషల్ మీడియాలో కొన్ని మెన్స్ ట్రెండ్ అవుతున్నాయి. నిధి అగర్వాల్ స్పెషల్ పూజలు వీడియో చూసిన నెటిజన్లు “పూజలు చేస్తే సినిమాలు హిట్ కావని.. కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరేమో వేణు స్వామి టైమ్ మళ్లీ వచ్చిందా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు. చూడాలి మరి ఈ పూజలు నిధికి ఎంతవరకు మేలు చేస్తాయో.

Exit mobile version