Site icon NTV Telugu

Nidhhi Agerwal : పవన్–ప్రభాస్ మల్టీస్టారర్‌పై కన్నేసిన నిధి అగర్వాల్..

Nidhi Agarwal

Nidhi Agarwal

ప్రజంట్ టాలీవుడ్ లో వినపడుతున్న హీరోయిన్‌లో నిధి అగర్వాల్ ఒకరు. కెరీర్ స్టార్టింగ్ తో పోల్చుకుంటే ప్రజంట్ ఈ అమ్మడులో చాలా మార్పు వచ్చింది. మంచి కథలు మాత్రమే ఎంచుకుని.. తనదైన స్టైల్ లో సైలెంట్ గా హిట్ లు కొడుతూ స్టార్ హీరోలతో బిజి బిజీగా గడుపుతోంది. ఇక ఈ నిధి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో మనకు తెలిసిందే..అయితే తాజాగా ఇటీవల అభిమానులతో జరిగిన ముచ్చట్లలో ఆమె తన మనసులోని ఒక భారీ ‘డ్రీమ్ ప్రాజెక్ట్’ గురించి బయటపెట్టింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో ఒక భారీ మల్టీస్టారర్ సినిమా రావాలని, అందులో తానే హీరోయిన్‌గా నటించాలని ఉందంటూ తన కోరికను బయటపెట్టింది. ఇప్పటికే పవన్‌తో ‘హరిహర వీరమల్లు’, ప్రభాస్‌తో ‘రాజా సాబ్’ సినిమాల్లో నటిస్తున్న నిధి, వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ మరియు యాటిట్యూడ్‌కు తాను ఫిదా అయిపోయానని, అందుకే ఈ ఇద్దరు దిగ్గజ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో ఉంటే చూడాలని ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

అయితే ఈ కాంబినేషన్ కేవలం వెండితెరపై కనిపిస్తే సరిపోదని, దీనికి మాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించాలని నిధి కోరుకోవడం ఇప్పుడు ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పిస్తోంది. పవన్-ప్రభాస్ వంటి ఇద్దరు మాస్ ఐకాన్లను సందీప్ రెడ్డి వంగ హ్యాండిల్ చేస్తే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలు పెట్టడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రియాలిటీలో ఇలాంటి మ్యాడ్ కాంబినేషన్ సెట్ అవ్వడం కష్టమే అయినా, నిధి అగర్వాల్ చెప్పిన ఈ ఊహ మాత్రం ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో సెన్సేషన్‌గా మారింది.

Exit mobile version