NTV Telugu Site icon

NIA recruitment: ఎన్ఐఏలో ఉద్యోగాలు.. అర్హతలు, జీతం ఎంతంటే?

Jobbss

Jobbss

ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఇటీవల పలు శాఖల్లో ఉన్న పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తుంది.. తాజాగా మరో ప్రముఖ సంస్థ ఎన్ఐఏలో లో ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ రిక్రూట్‌మెంట్ 2024 ద్వారా మొత్తం 40 పోస్టులను భర్తీ చేయనున్నారు..ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు NIA అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఈ పోస్టులకు మార్చి 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు, జీతం మొత్తం వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు..

ఈ రిక్రూట్‌మెంట్ కింద..మొత్తం 40 అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1, అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తున్నారు..

వయసు..

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ నాటికి 56 ఏళ్లు మించకూడదు..

జీతం..

అసిస్టెంట్ -నెలకు రూ. 35400 నుంచి రూ. 1,12400 వరకు ఇవ్వబడుతుంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1- రూ. 35400 నుండి రూ. 1,12400 వరకు జీతం లభిస్తుంది.. అప్పర్ డివిజన్ క్లర్క్- రూ. 25500 నుండి రూ. 81100 వరకు పొందుతారు..

ఇకపోతే అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌ను అవసరమైన పత్రాలతో పాటుగా.. SP (అడ్మినిస్ట్రేషన్), NIA హెడ్‌క్వార్టర్స్, CGO కాంప్లెక్స్, లోధి రోడ్, న్యూఢిల్లీ-110003 చిరునామాకి చివరి తేదీలోగా పంపించాలి.. మరింత సమాచారం కోసం అధికార వెబ్ సైట్ ను సందర్శించగలరు..