Site icon NTV Telugu

NHIT Recruitment 2023: ఎన్‌హెచ్‌ఐటీలో 51 ఉద్యోగాలు.. అర్హతలు ఏంటంటే?

nhit jobs

nhit jobs

కేంద్రప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు వరుస నోటిఫికేషన్ లను విడుదల చేస్తుంది.. ఇప్పటికే పలు శాఖల్లో ఉన్న ఖాళీలకు దరఖాస్తుల ను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు.. అదే విధంగా ఇప్పుడు మరో నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, NHAI జనరల్ మేనేజర్,, DGM పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్నవారు NHAI అధికారిక వెబ్‌సైట్ nhai.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు . NHAI రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఆగష్టు 28,2023నుండి చివరి తేదిగా గుర్తించారు.. పై పోస్ట్‌లకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 23 ఆగస్థు 2023. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా, మొత్తం 51 ఖాళీ పోస్టులు భర్తీ చేయబడతాయి. అభ్యర్థులు విద్యార్హతలు, ఖాళీలు మరియు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..

మొత్తం పోస్టుల వివరాలు :

ప్రాజెక్ట్‌ మేనేజర్,
ఇంజనీర్,
ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్,
డెవలప్‌మెంట్‌ మేనేజ­ర్,
డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌..

అర్హతలు..

పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్‌/ఇంజనీరింగ్‌ డిగ్రీ/సీఏ ఇంటర్‌/ఎంకామ్‌/ఎంబీఏ/ ఎంఎస్‌డబ్ల్యూ ఉత్తీర్ణులవ్వాలి.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: career@nhit.co.in లో అప్లై చేసుకోవచ్చు..
దరఖాస్తులకు చివరితేది: 23.08.2023.

వెబ్‌సైట్‌: http://nhit.co.in/. ను సందర్శించి పూర్తి వివరాలను చదివి అప్లై చేసుకోగలరు.. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ పై మంచి స్పందన రావడం తో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. వీటి గురించి పూర్తిగా తెలుసుకొని అప్లై చేసుకోగలరు..

Exit mobile version