Site icon NTV Telugu

FASTag KYV: ఫాస్ట్ ట్యాగ్ యూజర్లకు గుడ్ న్యూస్.. NHAI కీలక నిర్ణయం

Fastag

Fastag

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఫాస్టాగ్ వినియోగదారులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు మరో ముఖ్య నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1, 2026 నుంచి కార్లు, జీపులు, వ్యాన్లు (కార్/జీప్/వ్యాన్ కేటగిరీ) కొత్త ఫాస్టాగ్‌ల జారీలో నో యువర్ వెహికల్ (KYV) ప్రక్రియను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. KYV అనేది ఫాస్టాగ్‌ను సరైన వాహనానికి అతికించారని, సరైన వాహన నంబర్‌తో లింక్ చేశారని నిర్ధారించేందుకు పరిచయం చేసిన వెరిఫికేషన్ ప్రక్రియ. ఇందులో వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC), వాహన ఫోటోలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. గతంలో ఈ ప్రక్రియ పోస్ట్-ఇష్యూ (ఫాస్టాగ్ జారీ అయిన తర్వాత) చేయాల్సి రావడంతో లక్షలాది మంది వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ బ్లాక్ అయి ఆలస్యాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Also Read:AP Liquor Sales: రూ.2,767 కోట్ల అమ్మకాలు.. లిక్కర్ సేల్స్‌కు ప్రధాన కారణాలు ఇవే!

ఫిబ్రవరి 1, 2026 తర్వాత జారీ చేసే కార్ల ఫాస్టాగ్‌లకు KYV ప్రక్రియ అవసరం లేదు. ఇప్పటికే ఉన్న ఫాస్టాగ్‌లకు రొటీన్ KYV అవసరం లేదు. ఫిర్యాదులు (లూజ్ ట్యాగ్, తప్పుడు జారీ, దుర్వినియోగం వంటివి) వచ్చినప్పుడు మాత్రమే KYV చేపడతారు. ప్రీ-యాక్టివేషన్ వెరిఫికేషన్.. ఫాస్టాగ్ యాక్టివేట్ చేసే ముందే జారీ చేసే బ్యాంకులు వాహన వివరాలను వాహన్ డేటాబేస్ లేదా RC ద్వారా తప్పనిసరిగా వెరిఫై చేయాలి. ఇకపై పోస్ట్-యాక్టివేషన్ ఇబ్బందులు ఉండవు.

ఈ మార్పులతో ఫాస్టాగ్ జారీ చేసే బాధ్యత పూర్తిగా బ్యాంకులపైకి వచ్చింది. ఎన్‌హెచ్‌ఏఐ ఈ నిర్ణయం ద్వారా హైవే వినియోగదారులకు హాసిల్-ఫ్రీ అనుభవం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫాస్టాగ్ యాక్టివేషన్ తర్వాత డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా పోతుంది. టోల్ ప్లాజాల వద్ద ఆకస్మిక బ్లాకింగ్, ఆలస్యాలు తగ్గుతాయి. ఫాస్టాగ్ వ్యవస్థ మరింత పారదర్శకంగా, సిటిజన్-ఫ్రెండ్లీగా మారుతుంది.

Also Read:Nani: జడల్ హడల్.. ఎందయ్యా నాని.. వాళ్లు ఏమైపోవాలి!

ఎన్‌హెచ్‌ఏఐ గతంలో కూడా KYV ప్రక్రియను సరళీకరించింది – సైడ్ ఫోటోలు అవసరం లేకుండా చేసి, వాహన్ డేటాబేస్ నుంచి ఆటోమేటిక్‌గా వివరాలు తీసుకునేలా చేసింది. ఇప్పుడు ఈ రద్దు నిర్ణయంతో ఫాస్టాగ్ వినియోగదారులకు మరింత ఉపశమనం లభిస్తుంది.ఈ మార్పులు దేశవ్యాప్తంగా లక్షలాది మంది కారు యజమానులకు ప్రయోజనకరంగా ఉంటాయని, ఫాస్టాగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.

Exit mobile version