NTV Telugu Site icon

Toll fee: వాహనదారులకు శుభవార్త.. టోల్‌ ఛార్జీలపై ఈసీ ఆదేశాలివే!

Toll

Toll

సార్వత్రిక ఎన్నికల వేళ వాహనదారులకు భారీ ఊరట లభిచింది. పెంచిన టోల్‌ ఛార్జీలను ప్రస్తుతం వాయిదా వేయాలని ఎన్‌హెచ్‌ఏఐకు ఎన్నికల సంఘం సూచించింది. లోక్‌సభ ఎన్నికల తర్వాతే పెంచిన రుసుములు వసూలు చేయాలని ఆదేశించింది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వినతి మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఈసీ ఆదేశాలతో పాత ఛార్జీలే వసూలు చేయాలని టోల్‌ ఆపరేటర్లకు ఎన్‌హెచ్‌ఏఐ సూచించింది.

ఇది కూడా చదవండి: MI vs RR: తడబడిన ముంబై.. రాజస్థాన్ ముందు స్వల్ప లక్ష్యం

ప్రతి ఏడాది ఏప్రిల్‌ 1న టోల్‌ ఫీజు పెరుగుతుంటుంది. ఈ పెంపు సగటున 5 శాతం వరకు ఉంటుంది. దీంతో పెరిగిన ఛార్జీలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఎన్నికల నేపథ్యంలో ఈ పెంపును వాయిదా వేయాలని ఈసీ సూచించింది. దీంతో ఆ మేర వసూలు చేసిన మొత్తాలను వాహనదారులకు వెనక్కి వేయనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు వెల్లడించాయి.

ఇది కూడా చదవండి: Rishi Sunak: ఎన్నికల​ సర్వేల్లో రిషి సునాక్‌కు వచ్చిన రిజిల్ట్ ఇదే!

దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25 మరియు జూన్ 1న తదుపరి ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది.

ఇది కూడా చదవండి: Harish Shankar: పవన్ ఒప్పుకోవాలేగాని తుప్పు రేగ్గొడతామంటున్న హరీష్ శంకర్