NTV Telugu Site icon

Devara : గోవాలో ‘దేవర’ నూతన షెడ్యూల్..

Devara (1)

Devara (1)

Devara : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర” ..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమాను దర్శకుడు కొరటాల రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నాడు.మొదటి పార్ట్ ను మేకర్స్ అక్టోబర్ 10 న దసరా కానుకగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు  ప్రకటించారు.

Read Also :Thug Life : కమల్ ‘ థగ్ లైఫ్ ‘ షూటింగ్ అప్డేట్ వైరల్..

ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి ,కొడుకుగా డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు.ఇదిలా వుంటే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసారు.”ఫియర్ సాంగ్ ” గా వచ్చిన ఈ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.ఈ సాంగ్ లో ఎన్టీఆర్ విజువల్స్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించాయి.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.దేవర సినిమా కొత్త షెడ్యూల్ గోవాలో ప్రారంభం అయింది.ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ తో పాటు ఇతర కీలక నటులు కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు.ఈ షెడ్యూల్ లో కొంత టాకీ పార్ట్ తో పాటు ఓ సాంగ్ షూటింగ్ జరగనుందని సమాచారం

Show comments