New Traffic Rules: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ట్రాఫిక్ రూల్స్ నేటి నుంచి అమలు కాబోతున్నాయి. అందులో వాహనాలు, ట్రాఫిక్ రూల్స్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి వాటికి సంబంధించిన అంశాల్లో కేంద్ర సర్కార్ ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తుంది. ప్రస్తుతం, దేశంలో వాహనం నడపడం లేదా లైసెన్స్ పొందే వయస్సు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉంది. ఇక, మైనర్లు వాహనాలను నడిపితే 25 వేల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. అలాగే, అతనికి 25 ఏళ్లు వచ్చే వరకు ఎలాంటి లైసెన్స్ కూడా లభించదు.
Read Also: Viswak Sen : సినిమా చూడకుండానే రివ్యూస్ ఎలా ఇస్తారు..
నేటి నుంచి ట్రాఫిక్ రూల్స్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు కూడా అమల్లోకి రానున్నాయి. ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమిస్తే భారీ జరిమానా విధించేలా నిబంధనలు మార్పులు చేశారు. కొత్త రూల్ ప్రకారం.. ఓవర్ స్పీడ్ గా వాహనం నడిపితే రూ.1000 నుంచి రూ.2000 వరకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే 500 రూపాయల జరిమానా కట్టాల్సి ఉంటుంది. అంతే కాకుండా హెల్మెట్, సీటు బెల్ట్ లేకుండా వెహికిల్ నడిపితే 100 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది అని కొత్త నిబంధనలో రూపొందించారు. దీంతో పాటు ఇవాళ్టి (జూన్ 1) నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. డ్రైవింగ్ సూల్‌కు వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్‌ను పొందే అవకాశం ఉంది.