Site icon NTV Telugu

Nayanthara: నయనతారను ఇండస్ట్రీ బ్యాన్ చేసిందా..?

Nayanatara

Nayanatara

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.టాలీవుడ్,కోలివుడ్ లో స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తుంది.. ఇండస్ట్రీలో అధిక రెమ్యూనరేషన్ తీసుకొనే స్టార్ హీరోయిన్ కూడా ఈమెనే.. తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి దండ్రులు అయ్యారు.. ఇక ఇటీవలే ఇన్‌స్టాలోకి అడుగుపెట్టిన స్టార్‌ హీరోయిన్‌ నయనతార భర్తను అన్ ఫాలో చేసిందని రకరకాల వార్తలు పుట్టికొస్తున్నాయి.. దానిపై ఆమె భర్త స్పందించి పోస్ట్ తో క్లారిటీ ఇచ్చాడు.. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది…

నయనతార స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటు వరుస సినిమాల్లో బిజీగా ఉంటుంది…ఎంత స్టార్డమ్ వచ్చినా.. నయనతార మాత్రం సోషల్ మీడియాకు దూరంగానే ఉండేది. కానీ కొన్నిరోజుల కిత్రం తాను కూడా ఇన్స్టాగ్రామ్లో అడుగుపెట్టింది. ఇక ఇటీవల నయనతార ఇన్స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టి ఆసక్తికర పోస్టులు చేస్తుంది.. ఫాలోయింగ్ ను పెంచుకొనే పనిలో ఉంది.. ఇక ఈ మధ్య ఈమె తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.. దాంతో తెలుగు ఇండస్ట్రీ మరోసారి బ్యాన్ చేసిందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి..

గతంలో హీరోలపై నోరు పారేసుకొని కొంతకాలం తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంది.. ఇప్పుడు కూడా ఇదే కారణం అని తెలుస్తుంది. ఎంత ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పటికీ ఈమె అందరిపై నోరు పారేసుకోవడం నచ్చక బ్యాన్ చేసినట్లు ఓ వార్త ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.. కానీ దీనిపై క్లారీటి ఇవ్వాల్సి ఉంది.. ప్రస్తుతం పిల్లలతో గడుపుతుంది.. సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటుంది.. కొత్త సినిమాను ప్రకటించినట్లు కనిపించలేదు..

Exit mobile version