Site icon NTV Telugu

Tumbbad-2 :తుంబాడ్ 2 లో సెన్సేషనల్ యాక్టర్..

Tumbbad

Tumbbad

భారతీయ చలనచిత్ర రంగంలో అత్యుత్తమ హారర్ థ్రిల్లర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ‘తుంబాడ్’ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2018లో విడుదలైన ఈ చిత్రం, ఇటీవలే రీ-రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధించడమే కాకుండా, పార్ట్ 2 పై భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో, ‘తుంబాడ్ 2’లో ఒక కీలక పాత్ర కోసం మేకర్స్ బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ (Nawazuddin Siddiqui) ని ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగులో వెంకటేష్ నటించిన ‘సైంధవ్’ సినిమాలో విలన్‌గా మెప్పించిన నవాజుద్దీన్, ఇప్పుడు ఈ మైథాలజికల్ హారర్ యూనివర్స్‌లో చేరడం విశేషం.

ఈ అప్‌డేట్‌ను ధృవీకరిస్తూ హీరో,నిర్మాత సోహుమ్ షా (Sohum Shah), నవాజుద్దీన్‌తో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సినిమాలో నవాజుద్దీన్ పాత్ర అత్యంత శక్తివంతంగా ఉండబోతోందని సమాచారం. గతంలో ఈ పాత్ర కోసం అక్షయ్ ఖన్నా పేరు కూడా వినిపించినప్పటికీ, చివరికి మేకర్స్ నవాజుద్దీన్‌నే ఫిక్స్ చేశారు. పెన్ స్టూడియోస్, సోహుమ్ షా ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సీక్వెల్, మొదటి భాగం కంటే మరింత భయంకరంగా, లోతైన కథాంశంతో ఉండబోతోందని చిత్ర బృందం హామీ ఇస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవ్వడంతో ‘తుంబాడ్ 2’పై అంచనాలు రెట్టింపయ్యాయి.

Exit mobile version