Site icon NTV Telugu

DGP Nalin Prabhat: “ఇది ఒక యాక్సిడెంట్”.. శ్రీనగర్ పేలుడుపై స్పందించిన డీజీపీ..

Dgp

Dgp

DGP Nalin Prabhat: శ్రీనగర్ పేలుడుపై జమ్ము కశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ స్పందించారు. నౌగాం పోలీస్ స్టేషన్‌లో బ్లాస్ట్ ఓ యాక్సిడెంట్.. ఇదొక దురదృష్ట ఘటన అన్నారు. దీనిపై ఎలాంటి ఊహగానాలు చేయవద్దని స్పష్టం చేశారు. “నౌగాం పోలీస్ స్టేషన్ ఓపెన్ ఏరియాలో వెలుడు పదార్థాలు ఉంచాం.. ప్రొసీజర్ ప్రకారం ఫోరెన్సిక్ నిపుణులకు అప్పగించాం. గత రెండు రోజుల నుంచి ప్రొసీజర్ కొనసాగుతోంది. శాంపిల్ ప్రాసెసింగ్ చాలా జాగ్రత్తగా నిర్వహించారు. అయినప్పటికీ దురదృష్టవశాత్తు రాత్రి 11 గంటలకు 20 నిమిషాలకు యాక్సిడెంట్ జరిగింది. దీనిపై ఎలాంటి ఊహగానాలు వద్దు. ఇదొక దురదృష్టకర ఘటన.. 9 మంది చనిపోయారు.. ముగ్గురు ఎఫ్‌ఎస్ఎల్ నిపుణులు చనిపోయారు.. 27 మంది పోలీసులు గాయపడ్డారు..” అని స్పష్టం చేశారు.

READ MORE: Storyboard: బీహార్ బీజేపీ చేతుల్లోకి వచ్చేసిందా..? నితీష్ కుమార్ బ్లాక్మెయిల్ చేయలేడా..?

అసలు ఏం జరిగింది..?
జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. దక్షిణ శ్రీనగర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఆ ప్రాంతమంతా అర్ధరాత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ పేలుడు శబ్ధం కిలోమీటర్ల మేర ప్రతిధ్వనించింది. పోలీస్ స్టేషన్ భవనంలోని ఓ భవన భాగం కూలిపోయింది. అనేక వాహనాలు మంటల్లో కాలిపోయాయి. మానవ అవశేషాలు 300 అడుగుల దూరం వరకు చెల్లాచెదురుగా పడిపోయాయి. నౌగామ్ పేలుడు తర్వాత జమ్మూకశ్మీర్ అంతటా భద్రతా సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి. డీజీపీ నళిన్ ప్రభాత్ హైబ్రిడ్ భద్రతా సమీక్ష నిర్వహించారు. శుక్రవారం రాత్రి 11:22 గంటలకు జరిగిన ఈ పేలుడులో ఇప్పటివరకు తొమ్మిది మంది మరణించారు. గాయపడిన 30 మంది ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకున్నట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పేలుడు చాలా తీవ్రంగా ఉంది. మంటలు, పొగ ఆకాశంలోకి ఎగిసిపడ్డాయి. మంటల కారణంగా రెస్క్యూ బృందాలు దాదాపు గంటసేపు లోపలికి ప్రవేశించడానికి ఇబ్బంది పడ్డాయి. కాగా.. ఇటీవల హర్యానా, జమ్మూకశ్మీర్‌ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో భాగంగా ఫరీదాబాద్‌లోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్కడ 360 కిలోల పేలుడు పదార్థాలతో పాటు పలు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకొని నౌగామ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆ పేలుడు పదార్థాల నుంచి నమూనాలను తీస్తుండగా విస్ఫోటం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.

READ MORE: GlobeTrotterEvent : సంచలనానికి అంతా రెడీ.. రామోజీలో ఘట్టమనేని ఫ్యాన్స్ రచ్చ రచ్చ

Exit mobile version