Site icon NTV Telugu

Steel industry: ఈ నెల 29, 30న దేశవ్యాప్తంగా స్టీల్ ఇండస్ట్రీ సమ్మె..

Steel Industry

Steel Industry

ఈనెల 29,30వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా స్టీల్ ఇండస్ట్రీ సమ్మె చేసేందుకు రెడీ అయ్యాయి. ఇప్పటికే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఏఐటీయూసీ, ఐఎన్ టీయూసీ, సీఐటీయూలకు చెందిన కార్మిక సంఘాలు స్ట్రయిక్ ప్రకటించాయి. జిందాల్ ఎంఓయూ రద్దు చేసి ఆర్ఐఎన్ఎల్ ను ఎస్ఏఐఎల్ లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తు్న్నారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న 5 వేల ఉద్యోగాలను తక్షణం భర్తీ చేయాలని కోరారు. ఇక, కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు, నిర్వాశితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఎల్లుండి ( శనివారం ) జాతీయ స్థాయిలో ట్రేడ్ యూనియన్లను సెయిల్ యాజమాన్యం చర్చలకు పిలుచింది. ఈ చర్చల ఫలితం ఆధారంగా సమ్మె కొనసాగింపు ఉంటుందని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు.

Exit mobile version