Site icon NTV Telugu

Mohammed Shami: అర్జున అవార్డు అందుకున్న మొహమ్మద్ షమీ!

Mohammed Shami Arjuna Award

Mohammed Shami Arjuna Award

Cricketer Mohammed Shami Receives Arjuna Award: దేశ రెండో అత్యున్నత క్రీడా పురస్కారం ‘అర్జున అవార్డు’ను టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ అందుకున్నాడు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా షమీ అర్జున అవార్డును అందుకున్నారు. భారత గడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌ 2023లో అసాధారణ ప్రదర్శన గాను అతడికి ఈ అవార్డు దక్కింది. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం 2023 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. క్రీడాకారులకు అవార్డులను అందజేశారు.

భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ జోడీ రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌రత్న అవార్డును అందుకున్నారు. సాత్విక్‌- చిరాగ్‌ జోడీ ఆసియా క్రీడల్లో స్వర్ణం, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం, కామన్వెల్త్‌ క్రీడల్లో రజత పతకాలు సాధించిన విషయం తెలిసిందే. మొహమ్మద్ షమీ సహా మొత్తంగా 26 మంది అర్జున అవార్డులను అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈషా సింగ్‌ (షూటింగ్‌), మహ్మద్‌ హుసాముద్దీన్‌ (బాక్సింగ్‌), అజయ్‌కుమార్‌ రెడ్డి (అంధుల క్రికెట్‌)లను ఈ అవార్డు వరించింది.

అర్జున అవార్డు లిస్ట్:
క్రికెట్ – మొహమ్మద్ షమీ
అథ్లెటిక్స్ – ప‌రుల్ చౌద‌రీ, శ్రీ‌శంక‌ర్ ముర‌ళి
బాక్సింగ్ – మ‌హ్మ‌ద్ హుసాముద్దీన్
చెస్ – ఆర్ వైశాలి
క‌బ‌డ్డీ – ప‌వ‌న్ కుమార్, రీతు నేగీ
గోల్ఫ్ – దిక్షా ద‌గ‌ర్
షూటింగ్ – ఐశ్వ‌ర్య ప్ర‌తాప్ సింగ్ తోమ‌ర్, ఈషా సింగ్
స్క్వాష్ – హ‌రీంద‌ర్ పాల్ సింగ్ సాధు
టేబుల్ టెన్నిస్ – ఆహికా పంగ‌ల్
ఈక్వెస్ట్రియ‌న్ – అనుష్ అగ‌ర్వాల
ఈక్వెస్ట్రియ‌న్ డ్రెస్సేజ్ – దివ్య‌క్రితి సింగ్
హాకీ – కృష్ణ‌న్ బ‌హూద‌ర్ పాఠ‌క్, పుఖ్రంబం సుహిలా చాను
ఖో ఖో – న‌స్రీన్
లాన్ బౌల్స్ – పింకీ
రెజ్లింగ్ – సునీల్ కుమార్, అంతిమ్ పంగ‌ల్
పారా క‌నోయింగ్ – ప్ర‌చీ యాద‌వ్
వుషూ – నవోరెమ్ రోషిబిన దేవి
పారా ఆర్చ‌రీ – శీత‌ల్ దేవి
అంధుల క్రికెట్ – ఇల్లూరి అజ‌య్ కుమార్ రెడ్డి

Exit mobile version