బిజినెస్ మింట్ 40వ నేషన్ వైడ్ అవార్డులను హైదరాబాద్ హైటెక్ సిటీ హెచ్ఐసిసిలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బిజినెస్ మింట్, ది మార్కెట్ రీసెర్చ్ కంపెనీని వినయ్‌కాంత్ కొరపాటి స్థాపించారు. 40వ నేషన్ వైడ్ అవార్డ్స్ వేడుకలో, బిజినెస్ మింట్ భారతదేశంలోని వివిధ రంగాలకు చెందిన 100 మంది విజయవంతమైన వ్యక్తులను వారి వ్యాపారం, ఫ్యాషన్, హాస్పిటల్, ఎడ్యుకేషన్, సోషల్ వర్క్, హెల్త్, హాస్పిటాలిటీ, ఫుడ్ ఇండస్ట్రీ మొదలైన రంగాలలో నిష్ణాతులను గుర్తించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదాయపు పన్నుశాఖ కమిషనర్ జీవన్‌లాల్ లవిడియా, గౌరవ అతిథులుగా ఏపీ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జెఎ చౌదరి, తెలంగాణ ఐటీ డిపార్ట్‌మెంట్ ఓఎస్డి ఎల్. రమాదేవి, ఫౌండేషన్ ఫర్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ ప్రెసిడెంట్, బీజేపీ జాతీయ విభాగం కరుణ గోపాల్ వర్తకవి, ఏజీహబ్ సీఈఓ విజయ్ నడిమింటి, భారత రాష్ట్ర సమితి మహిళా అధ్యక్షురాలు సోఫియా హసీబ్ సిద్ధిఖీ పాల్గొని విజేతలకు అవార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా జీవన్‌లాల్ లావిడియ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల కోసమేనని, అయితే కంపెనీలు, పరిశ్రమలు, స్టార్టప్‌ల నుంచి అందజేసే సొమ్మును అందజేసి, ప్రభుత్వ వ్యవహారాలను ప్రజల కోసం చేస్తుందన్నారు. పరిశ్రమలు మరియు స్టార్టప్‌లు మన భారతీయ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని ఆయన అన్నారు. ప్రజలకు ఉద్యోగాలు, అదనపు సేవలు, విలాసవంతమైన జీవితాన్ని, భవిష్యత్తు కోసం మెరుగైన ప్రపంచాన్ని సృష్టించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.
అవార్డ్ గ్రహీతల్లో కొద్దిమంది:
డాక్టర్. స్నిగ్ధా గౌడ్, డానుబ్ హోమ్, ఐరన్ హిల్ బ్రూవరీ, ఎలిసియన్ ఇండస్ట్రీస్ ప్రై.లి. లిమిటెడ్., సుఖి గ్రూప్, ఇన్‌ఫ్లోన్, 100ఎన్. కేసరియాస్ స్వీట్స్, కంట్రీ చికెన్, CAR-O-MAN, HOMAA, రాఘవేంద్ర నీలిమా కన్స్ట్రక్షన్స్, గ్లోబల్ ఫార్మా టెక్, కాప్లియో గ్లోబల్, HIWAGA, SPARK_Truly Global, Inscape ORILL. LTD, సిమ్ & సామ్స్, అలంకారన్ వెడ్డింగ్స్ & ఈవెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్., ఎన్ఈడీ- న్యూ ఎరా డయాగ్నోస్టిక్స్, టికెట్ ఫ్యాక్టరీ, BCR OXY AIR ఎంటర్‌ప్రైజెస్, ప్రార్థన స్కూల్, DIVA ఇంటీరియర్స్, బోరింగ్ బ్యాంకర్ కేఫ్.
