Site icon NTV Telugu

Maa Nanna Superhero: ‘నాన్న’ను గుర్తు చేసేలా నాన్న సాంగ్

Nanna Song

Nanna Song

Nanna Song Full Video from Maa Nanna Super Hero Released: సుధీర్ బాబు అప్ కమింగ్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మా నాన్న సూపర్ హీరో’లో ఎమోషనల్ ప్యాక్డ్ రోల్ లో కనిపించనున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన ఈ మూవీ టీజర్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. తాజాగా మేకర్స్ నాన్న సాంగ్ ని రిలీజ్ చేసి మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ప్రతి కొడుకు తన తండ్రికి హార్ట్ ఫుల్ గా రాసే ప్రేమ లేఖ లాంటి అనుభవాన్ని ఇచ్చే ఈ సాంగ్ లో కొడుకు తన తండ్రి పట్ల ఉన్న ప్రేమ, అభిమానాన్ని అందంగా ప్రజెంట్ చేస్తుంది. తన తండ్రి తనను పూర్తిగా నెగ్లెట్ చేసినప్పటికీ, అతనితో సమయం గడపడానికి కొడుకు ఆనందపడతాడు. పెళ్లి భోజన సమయంలో సుధీర్ బాబు తన తండ్రికి నీళ్ళు అందజేస్తూ, తన అభిమానాన్ని చూపించడం ఈ సాంగ్ లో హైలెట్ మూమెంట్ గా నిలిచింది.

Devara: మెంటలెక్కిస్తున్న ‘దేవర’.. ఒక్కోటి ఒక్కో డైమాండ్ మావా!

జయ కృష్ణ అద్భుతమైన నెంబర్ ని స్కోర్ చేశారు. లక్ష్మీ ప్రియాంక లిరిక్స్ భావోద్వేగాలను ఇంటెన్స్ గా ప్రజెంట్ చేస్తుంది. నజీరుద్దీన్ వోకల్స్ డెప్త్ ని యాడ్ చేశాయి. రాజు సుందరం కొరియోగ్రఫీ ఇంపాక్ట్ ఫుల్ గా వుంది. సుధీర్ బాబు కూల్ గా కనిపించారు, సాయాజీ షిండే ఎరోగెంట్ ఫాదర్ గా తన నేచర్ చూపించారు. నాన్న సాంగ్ విజువల్స్ హత్తుకునేలా ఉన్నాయి, ఈ సాంగ్ తండ్రి కొడుకు బాండింగ్ కి మెమరబుల్ ట్రిబ్యూట్ లా వుంది. ఆర్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో సాయి చంద్, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్ కాగా, అనిల్ కుమార్ పి ఎడిటర్, ఝాన్సీ గోజాల ప్రొడక్షన్ డిజైనర్. మహేశ్వర్ రెడ్డి గోజాల క్రియేటివ్ ప్రొడ్యూసర్. MVS భరద్వాజ్, శ్రవణ్ మాదాల, అభిలాష్ రెడ్డి కంకర ఈ చిత్రానికి కో రైటర్స్. మా నాన్న సూపర్ హీరో అక్టోబర్ 11న గ్రాండ్ గా విడుదల కానుంది.

Exit mobile version