Nani : యానిమల్ కంటే మ్యాడ్ నెస్ పాత్రలు చేస్తాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న సినిమా థియేటర్లలో (డిసెంబర్ 7) నేడు విడుదలైంది. సినిమా విడుదల కంటే ముందు నాని హాయ్ నాన్నకు సంబంధించి కొన్ని ఆసక్తి వివరాలను తెలియజేశాడు..నాని హాయ్ నాన్న పై చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారనే ప్రశ్నకు.. “అది హాయ్ నాన్న కంటెంట్ ఇచ్చిన నమ్మకం. ఏదైనా సినిమాని చూసినప్పుడు అది నచ్చితే మొదట సోషల్ మీడియాలో సినిమాని అభినందిస్తూ నేను పోస్ట్ పెడతాను. తాజాగా వచ్చిన యానిమల్ కూడా అలా చేశాను. అది ఒక ప్రేక్షకుడిగా నా అనుభూతి. ‘హాయ్ నాన్న’ని ఒక ప్రేక్షకుడిగా చూసినప్పుడు నాకు అదే గొప్ప అనుభూతి కలిగింది. అదే ఈ నమ్మకాన్ని ఇచ్చింది” అని నాని తెలిపారు.
అయితే యానిమల్ లాంటి కథ వస్తే అంగీకరిస్తారా అనే ప్రశ్నకి “వందశాతం. దసరా లాంటి కథలో నన్ను ఊహించకున్నారా..చేస్తే గానీ ఊహించలేం. బహుశా అంత కంటే మ్యాడ్నెస్ ఉన్న పాత్రలు చేస్తానేమో చెప్పలేం కదా.అలాంటి సవాల్ తో కూడుకున్న పాత్రలు, కథలు వచ్చినపుడు వాటిని కచ్చితంగా చేయడానికే ఇష్టపడతాను” అని నాని చెప్పుకొచ్చాడు.తను నటిస్తున్న హిట్ 3 చిత్రం గురించి అడగగా.”హిట్ యూనివర్స్‌లో ప్రతి ఆలోచన కూడా నా దగ్గరకే ముందు వస్తుంది. ప్రస్తుతం కథ సిద్ధం అవుతుంది.వర్క్ పూర్తయిన వెంటనే మొదలుపెడతాం” అని నాని అప్డేట్ ఇచ్చాడు. అలాగే హాయ్ నాన్నపై నాని లీక్ ఇవ్వమని అంటే.. హాయ్ నాన్న ఇంటర్వెల్ కి అస్సలు ఇంటర్మిషన్ అని ఉండదు. హాయ్ అని వస్తుంది” అని నవ్వుతూ నాని తెలిపారుబలగం ఫేమ్ వేణుతో ఎల్లమ్మ అనే ప్రాజెక్ట్ గురించి అడగగా “ప్రస్తుతానికైతే ఏమి లేదు. అయితే దిల్ రాజు గారు, వేణు నాతో వర్క్ చేయాలని అనుకుంటున్నారని అయితే చెప్పారు. వేణు ఎంతో టాలెంట్ వున్న దర్శకుడు. బలగం చూసిన తర్వాత తనలో ఇంత టాలెంట్ ఉందా అని అనుకున్నాను. తను వచ్చి నాకు కథ చెబితే ఐయామ్ వెరీ హ్యాపీ” అని నాని తెలిపారు.
Also Read
- Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
తాజావార్తలు
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!