Site icon NTV Telugu

Nampally Court: అత్యాచారం కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు.. యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

Law

Law

అత్యాచారం కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మైనర్ బాలికను మోసగించి అత్యాచారం చేసిన కేసులో ఓ యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 21 ఏళ్ల కార్ వాషర్ జనపాల అఖిల్‌కు పోక్సో చట్టం కింద 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షను నాంపల్లి కోర్టు విధించింది. మైనర్ బాలికను మోసగించి గర్భవతిని చేసిన కేసులో నిందితుడిపై దర్యాప్తు చేసి చార్జ్‌షీట్ దాఖలు చేసిన పోలీసులు, 18 మంది సాక్షులను హాజరుపర్చి, ప్రాసిక్యూషన్ వాదనలు నిలబెట్టగలిగింది. నిందితుడికి రూ.5,000 జరిమానా, అలాగే బాధితురాలికి 8 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పు హైదరాబాద్ సౌత్ జోన్ చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్‌లో దాఖలైన కేసులో వెలువడింది.

Exit mobile version