Site icon NTV Telugu

Kubera: ధనుష్ ‘కుబేర’లో నాగార్జున పాత్ర ఇదే.. క్లారిటీ వచ్చేసిందిగా..

Dhanush In His First Look From 'kubera'

Dhanush In His First Look From 'kubera'

తమిళ స్టార్ హీరో ధనుష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడు.. ఇటీవల వచ్చిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి.. ఇప్పుడు కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుంది. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. భారీ స్థాయిలో సినిమాను తెరకెక్కిస్తున్నారు..

నాగార్జున పాత్ర స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది.. పవర్ ఫుల్ పోలీసు పాత్రలో కనిపించి చాలా కాలం అయిపోయింది. మరి కుబేరలో నాగ్‌ను ఎలా చూపిస్తారో చూడాలి.. ఈ సినిమా కోసం అటు నాగార్జున ఫ్యాన్స్, ఇటు ధనుష్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో కూడా శేఖర్ కమ్ముల ఈ సినిమా గురించి సంచలన విషయాలను బయట పెట్టాడు..

నాగార్జున సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది సంక్రాంతికి నా సామిరంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకుంది..ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. యంగ్, మధ్య వయసు పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించింది.. మొత్తానికి మరో హిట్ ను నాగ్ తన ఖాతాలో వేసుకున్నాడు.. మరో రెండు సినిమాలను నాగ్ లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది..

Exit mobile version