Nagarjuna – Konda Surekha: మంత్రి కొండా సురేఖ పై హీరో నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువునష్టం పిటీషన్ పై నేడు విచారణ కొనసాగననుంది. నేడు ఈ పిటిషన్ లో రెండో సాక్షి స్టేట్మెంట్ రికార్డు చేయనుంది కోర్టు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత తదుపరి విచారణ కోర్టు చేయనుంది. ఈనెల 8వ తేదీన పిటిషన్ దారుడు నాగార్జున, సాక్షిగా ఉన్న సుప్రియల స్టేట్మెంట్ రికార్డు చేసింది కోర్టు. వీరి స్టేట్మెంట్లు పూర్తయితే మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
Also Read: Ponnam Prabhakar: వాహనదారులకు వీడియో సందేశం ద్వారా విజ్ఞప్తి చేసిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
మంత్రి కొండా సురేఖ, అలాగే హీరోయిన్ సమంతపై చేసిన పలు వాఖ్యలకు సంబంధించి, అలాగే హీరో నాగార్జున కుటుంబాన్ని కించపరిచేలా మాట్లాడిందన్న ఉద్దేశంతో ఈ పరిస్థితి నెలకొంది. చూడాలి మరి నేడు విచారణ అనంతరం మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ అవుతాయో లేదో.
Also Read: Ratan Tata : ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్ దాకా…రతన్ టాటా పట్టిందల్లా బంగారమే