Site icon NTV Telugu

Nagaram fire accident: విషాదం.. దీపం అంటుకొని చిన్నారి మృతి

Fire

Fire

Nagaram fire accident: దీపం అంటుకొని తీవ్ర గాయాలపాలైన ఏడేళ్ల చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాద ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం మున్సిపాలిటీ ఆర్.ఎల్. నగర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా, బీబీనగర్ గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులతో నాగారం మున్సిపాలిటీలోని ఆర్.ఎల్. నగర్ లో నివాసముంటున్నారు. బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇంట్లో దీపాలు వెలిగించారు.

Elon Musk: హ్యూమనాయిడ్ రోబోట్ తో కలిసి డాన్స్ చేసిన ప్రపంచ కుబేరుడు.. వీడియో వైరల్

అయితే మధుసూదన్ రెడ్డి కుమార్తె సాయి నేహా రెడ్డి(7)కి ఇంట్లో ప్రమాదవశాత్తు దుస్తులకు దీపం అంటుకోవడంతో కేకలు వేసింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సైనిక్ పురిలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లగా వైద్యుల సూచన మేరకు ఖార్కానాలోని రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా 90 శాతం శరీరం కాలిపోవడంతో పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

Cryo వెలాసిటీ కూలింగ్ సిస్టమ్, 7300mAh బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K ఫీచర్లతో OnePlus 15 సిద్ధం..!

Exit mobile version