Thandel :యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్నలేటెస్ట్ మూవీ “తండేల్”.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో నాగ చైతన్య సరసన స్టార్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.2018లో గుజరాత్ లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తండేల్ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా నాగ చైతన్య 23 వ సినిమాగా తెరకెక్కుతుంది.కార్తికేయ 2 సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న చందు మొండేటి,నాగ చైతన్య కాంబినేషన్ లో మూడో సినిమాగా ‘తండేల్’ మూవీ తెరకెక్కుతుంది.
Read Also : Pushpa 2 : శ్రీవల్లి సాంగ్ పై రష్మిక స్పెషల్ ట్వీట్ వైరల్..
ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. తండేల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 20న థియేటర్లలో ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఇప్పటికే మేకర్స్ పోస్టర్స్ ,గ్లింప్సె వీడియో రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. . తాజాగా నాగ చైతన్య తండేల్ షూటింగ్ లొకేషన్ స్టిల్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పడవపై నిలబడి తాడు చుడుతున్న నాగ చైతన్య లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
#Thandel pic.twitter.com/wlhOhtbBEn
— chaitanya akkineni (@chay_akkineni) May 22, 2024