Naga Chaitanya : యూట్యూబ్ ప్రపంచం లోకి అడుగు పెట్టిన నాగ చైతన్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగ చైతన్య.. హీరో గా వరుస సినిమాలు చేస్తూ తనదైన శైలి లో మెప్పిస్తున్నాడు..రీసెంట్ గా కస్టడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ చైతన్య ఈ సినిమాతో తన కెరీర్ లో డిజాస్టర్ ను ఫేస్ చేశాడు. ఇక తాజాగా నాగ చైతన్య దూత అనే వెబ్ సిరీస్ లో నటించాడు . అతి త్వరలో దూత వెబ్ సిరీస్ ద్వారా ఆడియన్స్ ముందుకి రానున్నారు నాగ చైతన్య. మరోవైపు తన కెరీర్ లో 23వ సినిమాను యంగ్ డైరెక్టర్ చందూ మొండేటితో చేసందుకు సిద్ధం అయ్యాడు నాగ చైతన్య.ఇక సినిమా సెలబ్రెటీలు సినిమాతో పాటు ప్రస్తుతం సోషల్ మీడియా కూడా బాగా పాపులర్ అవుతున్నారు. ఏ స్టార్ కు సబంధించిన అప్ డేట్ చూడాలన్నా ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లోనే చూడాలి. అయితే ఎక్స్,ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ పామ్స్ లో యాక్టీవ్ గా ఉంటూ ఫ్యాన్స్ కు కావల్సిన అప్ డేట్ తో పాటు మంచి మంచి కంటెంట్ లను ఇస్తూ వారిని ఎంటర్టైన్ చేస్తున్నారు సెలబ్రిటీలు.
ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు తమకు సంబంధించిన విశేషాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే.సోషల్ మీడియా ద్వారా వారికి సంబంధించిన సినిమాల అప్ డేట్స్ ను అందిస్తూ.. వాటికి కావల్సిన ప్రమోషన్స్‌ను కూడా ఈ వేదికల ద్వారా ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి నాగ చైతన్య వచ్చి చేరాడు. అక్కినేని నాగచైతన్య పేరుతో ఛానల్‌ను రూపొందించి ఆయన.. అందులో శుక్రవారం ఓ వీడియో ను కూడా పోస్ట్ చేశాడు. యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టానంటూ ఆయన వెల్లడించాడు.ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర జవాబులు కూడా ఇచ్చాడు. ఇందులో భాగంగా ఓ నెటిజన్ జుట్టు, గడ్డం పెంచడానికి కారణం తెలుసుకోవచ్చా.. అని ప్రశ్నించాడు. దీనికి చైతూ బదులిస్తూ.. ఆరు నెలలుగా నాకు ఎలాంటి జాబ్ లేదని కేవలం ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నట్లు తెలిపారు..ఏ పని లేక జుట్టు, గడ్డం పెంచినట్లు నాగ చైతన్య సరదాగా సమాధానమిచ్చాడు. ఆ తర్వాత తాను హీరోగా నటిస్తున్న చందూ మొండేటి తెరకెక్కించనున్న సినిమా కోసం ఈ లుక్ లో కనిపిస్తున్నానని నాగ చైతన్య తెలియజేసాడు.
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
తాజావార్తలు
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!