Site icon NTV Telugu

Spy : నిఖిల్ స్పై సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగచైతన్య…

Whatsapp Image 2023 06 28 At 11.51.32 Am

Whatsapp Image 2023 06 28 At 11.51.32 Am

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తాజాగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ”స్పై”. ఈ సినిమా పై మంచి అంచనాలు వున్నాయి.బీ హెచ్ గ్యారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను ముందుకు రాబోతుంది.. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ తో ఈ సినిమా అంచనాలు అమాంతం పెరిగాయి.ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు..ఈ సినిమాను బక్రీద్ సందర్బంగా ఈ నెల 29 న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.విడుదల సమయం దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని వెస్టిన్ హోటల్ లో ఎంతో గ్రాండ్ గా జరిగింది.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా నాగ చైతన్య హాజరయ్యారు.. నాగచైతన్య స్పై సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

నిఖిల్ అంటే తనకు ఎంతో ఇష్టం అని. చిన్న హీరో స్థాయి నుండి పాన్ ఇండియా స్థాయి కి ఎదిగిన నిఖిల్ ను చూసి నేను ఎంతో గర్వపడుతున్న అని ఆయన తెలిపారు.. స్పై వంటి థ్రిల్లర్ సినిమా చేయడం ఎంతో కష్టం అని నాగచైతన్య తెలిపారు తనకు స్పై ట్రైలర్ ఎంతో బాగా నచ్చిందని చైతూ చెప్పుకొచ్చారు. తన తరపున స్పై సినిమా టీమ్ కు ఆల్ ది బెస్ట్ కూడా తెలిపారు నాగచైతన్య.నిఖిల్ స్పై సినిమా తర్వాత మరింత గొప్ప స్థాయికి చేరుకుంటారని తెలిపారు నాగచైతన్య. ఈ సినిమాను ఇడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కే రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు. అలాగే సినిమాకు అద్భుతమైన కథ ను కూడా అందించారు.అలాగే ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఆర్యన్ రాజేష్ ఒక ముఖ్య పాత్రలో నటించాడు. ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా నిఖిల్ మరోసారి పాపులర్ అవుతాడేమో చూడాలి.

Exit mobile version