Site icon NTV Telugu

NABARD Jobs : వ్యవసాయ గ్రామీణ బ్యాంక్ లో పలు ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..

Jobs

Jobs

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. కేంద్ర జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్‌ (నాబార్డ్‌) పలు పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రేడ్‌ ఏ ఆఫీసర్‌ ఆసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనుంది.. డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు… ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.మొత్తం 150 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే జనరల్‌, కంప్యూటర్‌ ఇన్ఫర్మేషన్‌ ట్నాలజీ 40, ఫైనాన్స్‌ 15, కంపెనీ సెక్రటరీ 8, సివిల్‌ ఇంజినీరింగ్‌ 8, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ 8, జియో ఇన్ఫర్మాటిక్స్‌ ఓ ఫారెస్ట్రీ 2, పుడ్‌ ప్రాసెసింగ్‌ 2 స్టాటిస్టిక్స్‌ 2 మాస్‌ కమ్యూనికేషన్‌ 1 ఖాళీలు ఉన్నాయి. జనరల్‌ పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులైతే 55 శాతం ఉత్తీర్ణత మార్కులు సరిపోతాయి. ఇక ఎంబీఏ,పేజీడీఎంలో 55 శాతం మార్కులు పొందినవారూ సైతం అర్హులే…

ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ విధానం ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఫేజ్ 1లో ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఇదంతా అబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. ఫేట్ 2 లో మెయిన్ పరిక్ష ఉంటుంది. ఈ పరీక్ష అబ్జెక్టీవ్, డిస్క్రిప్టివ్ విధానాల్లో ఉంటుంది. ఫేజ్ 2 సాధించి మెరిట్ మార్కుల అధారంగా ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున ఇంటర్వ్యూ కు పిలుస్తారు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు లక్ష జీతాన్ని ఇవ్వనున్నారు.. అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదిగా సెప్టెంబరు 23, 2023ను నిర్ణయించారు. ఫేజ్ 1 ఆన్ లైన్ ప్రిలిమినరీ పరీక్ష అక్టోబరు 16న నిర్వహించనున్నారు.. ఈ ఉద్యోగాలు గురించి మరిన్ని వివరాలకు వెబ్ సైట్ ; https://www.nabard.org పరిశీలించగలరు..

Exit mobile version