Mytri Movie Makers :సైలెంట్ గా సల్మాన్ తో సినిమా .. మైత్రి మూవీ మేకర్స్ మామూలోళ్ళు కాదుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ గా మైత్రీ మూవీ మేకర్స్ పేరు పొందారు.. అగ్ర నిర్మాణ సంస్థ ల్లో ఒకటిగా మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారు.మహేష్ బాబుతో శ్రీమంతుడు సినిమా తో వారి సినీ ప్రయాణం మొదలు అయింది. అప్పటి నుండి వరుసగా స్టార్ హీరోల తో భారీ సినిమాలు నిర్మించి వరుస సక్సెస్ లను అందుకుంటున్నారు.టాలీవుడ్ లో సక్సెస్ రేట్ ఎక్కువ వున్న నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్..ఎంతో మంది దర్శకులకు లైఫ్ ఇచ్చిన ఈ నిర్మాణ సంస్థ బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా ఏకంగా సల్మాన్ ఖాన్ తో కలిసి. సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్, మైత్రి మూవీ మేకర్స్, మరో నిర్మాణ సంస్థ కలిసి బాలీవుడ్ లో ‘ఫర్రి’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది .
థాయిలాండ్ కి చెందిన బ్యాడ్ జీనియస్ అనే సినిమా కు రీమేక్ గా తెరకెక్కుతున్నట్టు సమాచారం.ఇక రీసెంట్ గా ఫర్రి ట్రైలర్ కూడా రిలిజ్ చేశారు మూవీ టీమ్.. కొంతమంది స్మార్ట్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ లో ఎలా కాపీ కొడతారు, అలాంటి వాళ్ళని ఎలా పట్టుకున్నారు, వాళ్ళ లైఫ్ ఏమైంది అనేది ఈ సినిమా కథ.ఆసక్తికర స్టోరీతో యూత్ ను అట్రాక్ట్ చేసేలా ఈమూవీ తెరకెక్కుతోంది. ఇక ఫర్రీ సినిమా ను నవంబర్ 24న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.అయితే ఈ సినిమా కి సల్మాన్ ఖాన్ కేవలం నిర్మాత గా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. అంతే కాదు ఈ మూవీ లో సల్మాన్ గెస్ట్ రోల్ కూడా చేసినట్టు సమాచారం. సల్మాన్ తో కలిసి ఫర్రి సినిమాని బాలీవుడ్ లో మైత్రి మేకర్స్ నిర్మిస్తుండటంతో.. మైత్రీ వారు బాలీవుడ్ లో కూడా మంచి సక్సెస్ అందుకోవాలని ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు
Also Read
- Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు తప్పవు?
- IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
- Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
- Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
తాజావార్తలు
-
Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు తప్పవు?
-
Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై!
-
Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!