Site icon NTV Telugu

Muskan: ముస్కాన్ కూతురికి తండ్రి ఎవరు? ఆమె హత్య చేసిన భర్త..? ప్రియుడా..?

Meerutmurder

Meerutmurder

Muskan Saurabh Rajput Case: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన బ్లూ డ్రమ్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. భర్త సౌరభ్ రాజ్‌పుత్ హత్య చేసి బ్లూ డ్రమ్‌లో దాచిపెట్టిన ముస్కాన్ గుర్తుంది కదా.. ముస్కాన్ మరోసారి ముఖ్యాంశాలలో నిలిచింది. సౌరభ్ హత్యలో ప్రధాన నిందితురాలు ఎనిమిది నెలలుగా జైల్లో ఉంది.. తాజాగా ముస్కాన్ ఆదివారం సాయంత్రం మెడికల్ కాలేజీలో ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ వార్త కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. ఈ నవజాత శిశువుకు తండ్రి ఎవరు? ఆమె హత్య చేసిన భర్త..? లేదా ఆమె వివాహేతర బంధం కొనసాగించిన వ్యక్తా? అనే అనుమానం వ్యక్తమవుతోంది.

READ MORE: PM Modi-Ayodhya: ఆయోధ్య రామాలయంపై కాషాయ జెండా ఆవిష్కరించిన మోడీ

పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం సాయంత్రం 6:30 – 7:00 గంటల మధ్య ముస్కాన్ మెడికల్ కాలేజీలోని ప్రత్యేక మహిళా వార్డులో బిడ్డకు జన్మనిచ్చింది. శనివారం రాత్రి ప్రసవ నొప్పులు పెరగడంతో ఆమెను మీరట్ జైలు నుంచి ఆసుపత్రికి తీసుకువచ్చారు. భారీ భద్రత మధ్య ముస్కాన్ ప్రసవం జరిగింది. బయటి వ్యక్తులను వార్డులోకి అనుమతించలేదు. ఎనిమిది మంది సభ్యుల వైద్య, భద్రతా బృందాన్ని మాత్రమే లోపలికి అనుమతించారు. ముస్కాన్ ఆరోగ్యకరమైన ఆడ శిశువుకు జన్మనిచ్చిందని మీరట్ జైలు సూపరింటెండెంట్ డాక్టర్ వీరేష్ రాజ్ శర్మ ధృవీకరించారు. శిశువు దాదాపు ఎనిమిదిన్నర నెలల వయసులో జన్మించింది. ముస్కాన్ కుటుంబంలోని ఒక్క సభ్యుడు కూడా ఆసుపత్రికి రాలేదని ఆసుపత్రి పరిపాలన పేర్కొంది.

READ MORE: T20 World Cup 2026 Schedule: నేడే టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌.. భారత్‌లోని 5 వేదికల్లో మ్యాచ్‌లు!

ముస్కాన్ కు ఇప్పటికే 3 సంవత్సరాల కుమార్తె పిహు ఉంది. ఆ బాలిక సౌరభ్ తల్లిదండ్రులతో నివసిస్తోంది. అయితే.. ఎనిమిదేళ్ల కిందట పోలీసులు ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్‌ను అరెస్టు చేసినప్పుడు.. ఆమె దాదాపు ఒకటిన్నర నెలల గర్భవతి. మొదట్లో పోలీసులు వద్ద తను కడుపుతో ఉన్న విషయాన్ని దాచడానికి ప్రయత్నించింది. కానీ దర్యాప్తులో నిజం బయటపడింది. మరోవైపు.. సౌరభ్ అన్నయ్య రాహుల్ రాజ్‌పుత్, ముస్కాన్ బిడ్డ తన సోదరుడి వల్లే పుట్టిందని రుజువైతేనే ఆమెను దత్తత తీసుకుంటామని ఇప్పటికే చెప్పాడు. ఆ బిడ్డ సౌరభ్ ఇంతకీ ఎవరి బిడ్డ అనేది DNA పరీక్షల్లో తేలనుంది.

Exit mobile version