Musi River Floods MGBS: నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీ నదికి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో నదిలోకి నీటి ప్రవాహం మరింత పెరిగింది. భారీ వర్షాల కారణంగా మూసీ నదిలో నీటి ప్రవాహం పెరిగిపోవడంతో, ముసరాంబాగ్ వంతెన మూసివేశారు. దీంతో రాకపోకలు నిలిపివేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ నేపథ్యంలో మూసీ నదికి వరద ఉద్ధృతి రావడంతో కొత్తగా నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. వరదల వల్ల పాతబస్తీ, అంబర్‌పేట, చాదర్‌ఘాట్ నుంచి ఎంజీబీఎస్ వరకు నీరు చేరింది.
READ MORE: బీచ్ బ్యూటీగా చెలరేగిపోయిన మలయాళం నటి: దీప్తి సాతి
మరోవైపు.. ఎంజీబీఎస్‌కి వరద పోటెత్తింది. తెలంగాణలో దసరా, బతుకమ్మ పండుగలకు ఎంత ప్రాధాన్యత ఉందో చెప్పనవసరం లేదు. నగరానికి బతుకుదెరువు నిమిత్తం పట్టణానికి వలస వచ్చిన వారందరూ పల్లెలకు బయలుదేరేందుకు ఎంజీబీఎస్‌కి చేరుకున్నారు. నగరంలో చదువుతున్న విద్యార్థులు సైతం సెలవుల నేపథ్యంలో ఇళ్లకు బయలుదేరారు. ఇలా ఎంజీబీఎస్‌కి చేరిన ప్రయాణికుల తమ బస్సుల కోసం ఎదురుచూస్తున్న క్రమంలోనే మూసీ ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగిపోయింది. నది ఒడ్డున ఉన్న ఎంజీబీఎస్ బస్టాండ్‌లోకి వరద నీరు పోటెత్తింది. బస్టాండ్‌లో ఎక్కడికక్కడ నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వందల మంది ప్రయాణికులు బస్టాండ్‌లోనే చిక్కుకుపోయారు. గంటల పాటు భయం గుప్పిట్లో అల్లాడిపోయారు. “పండగ పూట ఇంటికి ఎట్లా పోయేది సారూ” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధికారులు రంగంలోకి దిగారు.
READ MORE: Epstein Files: అమెరికన్ రాజకీయాల్లో కొత్త సంచలనం.. ఎప్‌స్టైన్ ఫైళ్లలో ప్రపంచ కుబేరుడి పేరు.. !
తాజాగా మూసీ వరద ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు.. చాదర్ ఘాట్, మూసారంబాగ్, ఎంజీ బీ ఎస్ ప్రాంతాల్లో పర్యటించారు. చాదర్ ఘాట్ ప్రాంతంలో మూసి నది ముంచెత్తిన నివాస ప్రాంతాలలో సహాయక చర్యలను పరిశీలించారు. నీట మునిగిన ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ స్థానికులకు విజ్ఞప్తి చేశారు. అక్కడ వరదలో చిక్కుకుని భవనాలపై ఉన్నవాళ్ళకి డ్రోన్స్ ద్వారా ఆహారం అందజేశారు. ఎంజీబీఎస్ వద్ద మూసి నది రిటైనింగ్ వాల్ పడిపోవడంతో వరద లోపలకి ప్రవేశించిన ప్రాంతాలను పరిశీలించారు. దసరా సెలవుల నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా హైడ్రా DRF సిబ్బందని చేయాలని ఆదేశించారు.. శుక్రవారం అర్ధ రాత్రి MGBS ప్రాంగణంలోకి వరద వచ్చినప్పుడు చేపట్టిన సహాయక చర్యలను కమిషనర్ అభినందించారు.
