Site icon NTV Telugu

Delhi: ఆపద్ధర్మ కేంద్ర కేబినెట్‌కు రాష్ట్రపతి విందు.. హాజరైన మోడీ

Vindhu

Vindhu

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో పదవీకాలం ముగిసిన కేంద్ర మంత్రి మండలికి ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు మోడీ, అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, నిర్మలా సీతారామన్, తదితరులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే మోడీ 2.0 ప్రభుత్వాన్ని రాష్ట్రపతి రద్దు చేశారు. త్వరలోనే మోడీ మరోసారి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.

ఇదిలా ఉంటే బుధవారం ఎన్డీయే నేతలు ప్రధాని మోడీ నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి హాజరైన ఎన్డీయే పక్షాలు మోడీని కూటమిపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 7న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. నరేంద్ర మోడీ ఈనెల 9న మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

 

 

 

Exit mobile version