ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారు అయ్యాయి. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ టీమ్స్ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లాయి. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచుల్లో ఎనిమిదింట్లో విజయం సాధించిన ముంబై.. 16 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుతం పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న ముంబై.. రెండో స్థానంలోకి దూసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇది జరగాలంటే పంజాబ్‌తో జరగనున్న మ్యాచ్‌లో ముంబై కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ పంజాబ్‌గెలిస్తే ముంబై ఖాతాలో 18 పాయింట్స్ చేరుతాయి. అయితే గెలిచినంత మాత్రాన ముంబైకి రెండోస్థానం దక్కదు. మరి ఆ అవకాశాలు ఏంటో ఓసారి చూద్దాం.
ప్రస్తుతం 18 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్ మొదటి స్థానంలో ఉంది. 17 పాయింట్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో స్థానంలో, అదే 17 పాయింట్లతో పంజాబ్ కింగ్స్ మూడో స్థానంలో ఉంది. లీగ్ దశలో లక్నో, చెన్నైలతో గుజరాత్ ఆడాల్సి ఉంది. హైదరాబాద్, లక్నోతో బెంగళూరు తలపడాల్సి ఉంది. ఢిల్లీ, ముంబైతో పంజాబ్ తలపడాల్సి ఉంది. ముంబై టాప్-2 లోకి రావాలంటే గుజరాత్, బెంగళూరు, పంజాబ్ మిగతా మ్యాచుల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. అలాగే పంజాబ్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో ముంబై విజయం సాదించాలి. ఇది జరిగితేనే ముంబై రెండో స్థానానికి చేరుకుంటుంది.
ఒకవేళ బెంగళూరు, పంజాబ్ జట్లు లీగ్ దశలో మిగిలిన తమ రెండు మ్యాచ్‌లలో ఓడితే.. 18 పాయింట్లతో ముంబై రెండో స్థానంలో ఉంటుంది. గుజరాత్, బెంగళూరు మిగిలి ఉన్న మ్యాచుల్లో ఓడిపోతే.. 18 పాయింట్లతో ముంబై రెండో స్థానంలోకి వస్తుంది. ఒకవేళ పంజాబ్, గుజరాత్ మిగిలిన మ్యాచుల్లో ఓడిపోతే.. 18 పాయింట్లతో ముంబై రెండో స్థానంలోకి దూసుకొస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
