NTV Telugu Site icon

Mumbai Indians Record: ముంబై ఇండియన్స్‌ అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి జట్టు!

Mumbai Indians Record

Mumbai Indians Record

Mumbai Indians Played 250 Match in IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ముంబై ఇండియన్స్‌ జట్టు అరుదైన ఘ‌న‌త సాధించింది. ఐపీఎల్ చ‌రిత్ర‌లో 250 మ్యాచ్‌లు ఆడిన మొద‌టి జ‌ట్టుగా ముంబై రికార్డుల్లోకెక్కింది. ఐపీఎల్‌ 2024లో భాగంగా సోమవారం (ఏప్రిల్ 1) వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఈ ఫీట్ అందుకుంది. ఐపీఎల్ 17 ఎడిషన్లలో ముంబై జట్టు 250 మ్యాచ్‌లు ఆడింది.

ముంబై ఇండియన్స్‌ తర్వాత ఐపీఎల్ టోర్నీలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో స్ధానంలో ఉంది. బెంగళూరు ఇప్పటివరకు 244 మ్యాచ్‌లు ఆడింది. ఢిల్లీ క్యాపిటల్స్ (241), కోల్‌కతా నైట్ రైడర్స్ (239), పంజాబ్ కింగ్స్ (235), చెన్నై సూపర్ కింగ్స్ (228) మ్యాచ్‌లు ఆడాయి. 2016, 2017 ఎడిషన్లలో ఐపీఎల్‌కు చెన్నై దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

Also Read: MS Dhoni: హైదరాబాద్‌లో ఎంఎస్ ధోనీ.. వీడియో వైరల్!

రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియన్స్‌ జట్టు 2013లో తొలి టైటిల్ అందుకుంది. రోహిత్ నేతృత్వంలోనే 2015, 2017, 2019 మరియు 2020లో ముంబై ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. ముంబై ఇప్పటివరకు ఐదు ఐపీఎల్ టైటిల్స్ సాధించింది. ఈ క్రమంలోనే అత్యధిక మ్యాచ్‌లు ఆడింది. అయితే గత మూడు సీజన్లుగా ముంబై పెద్దగా రాణించడం లేదు. ఐపీఎల్ 2024లో కూడా ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌లలో ఓడింది.