మృణాల్ ఠాకూర్.. ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అదికొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది.. మొదటి సినిమానే అమ్మడుకు మంచి టాక్ ను అందించింది.. ప్రస్తుతం యూత్ మృణాల్ కు బాగా కనెక్ట్ అవుతున్నారు.. దాంతో దర్శక, నిర్మాతలు కూడా ఈ అమ్మడును హీరోయిన్ పెట్టాలని డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ మృణాల్ చేతిలో అర డజనుకు పై సినిమాలు ఉన్నాయి.. ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే వార్త ఇండస్ట్రీలో కోడై కూస్తుంది..
ప్రముఖ డ్యాన్సర్, నిర్మాత, డైరెక్టర్, హీరో రాఘవ లారెన్స్ సరసన జోడిగా నటించబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి.. రాఘవా లారెన్స్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ ఫిల్మ్ తెరకెక్కనుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ప్రారంభం కానుందని వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది..
ఈ సినిమా లారెన్స్‌కు జోడీగా మృణాళ్ కనిపిస్తారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో లేటెస్ట్‌గా వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాకు ‘శ్రీరామరక్ష’ అనే టైటిల్‌ను కూడా అనుకుంటున్నారట మేకర్స్. కాగా ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.. ఇక మృణాల్ ప్రస్తుతం ఐదు, ఆరు సినిమాలను లైన్ లో పెట్టింది.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. తన పర్సనల్ విషయాలను షేర్ చేస్తుంది.. ఇటీవల నాని హాయ్ నాన్న సినిమాలో హీరోయిన్ గా నటించి సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది..
