మృణాల్ ఠాకూర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు.. ఒక్క సినిమాతోనే అందరి చూపును తనవైపు తిప్పుకుంది.. సీతారామం సినిమాలో చాలా పద్దతిగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు మతి పోగొడుతుంది.. రోజూ రోజుకు అందాల ప్రదర్శనకు బౌండరీలు చేరిపేస్తుంది.. తాజాగా బ్లాక్ డ్రెస్సులో కిల్లింగ్ పోజులతో హాట్ ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.. ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి.. ఇక తాజాగా తన సిస్టర్ తో దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ప్రస్తుతం మృణాల్ పేరు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ మృణాల్ వరుసగా పోస్టులు పెడుతూ మరింత హాట్ టాపిక్ గా మారుతోంది. మరోవైపు మృణాల్ చేస్తున్న ఫొటోషూట్లు స్టన్నింగ్ గా ఉంటున్నాయి. గ్లామర్ షోలో నెక్ట్స్ లెవల్ అనిపిస్తోంది.. తాజాగా ఆమె సోదరికి సంబంధించిన కొన్ని ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. మృణాల్ సోదరి పేరు లోచన్ ఠాకూర్. ఆమె మోడల్ కమ్ నటి కూడా. ఆమె ఇన్ స్టాలో ఎక్కువగా తన చెల్లెలు మృణాల్ కు సంబంధించిన ఫోటోస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఆమె కూడా అందంగానే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు..
ఇక సినిమాల విషయానికొస్తే.. రెండు భారీ సినిమాల్లో ఛాన్స్ లు అందుకుందని తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్, శింబు సరసన అవకాశాలు అందుకుందట మృణాల్. ఇటీవల విడుదలైన మార్క్ ఆంటోని చిత్రం ఫేమ్ ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ చేస్తున్నారు. ఈ సినిమాలో మృణాల్ ను హీరోయిన్ గా అనుకుంటున్నారట. ఈ సినిమా ఛాన్స్ వస్తే అమ్మడు రేంజ్ పూర్తిగా మారిపోతుంది.. శివకార్తికేయన్ మురగదాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో మృణాల్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. ఈ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. తెలుగుతో పాటు తమిళ్ ఇండస్ట్రీలోనూ బిజీగా అయిపొయింది మృణాల్.. మొత్తానికి సీత బాగా బిజీ అయ్యింది..