MP Mithun Reddy Facilities List in Rajahmundry Central Jail: జైల్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సదుపాయాలు కల్పించాన్న పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. తీర్పును విజయవాడ ఏసీబీ కోర్టు రిజర్వ్ చేసింది. ఇవాళ సాయంత్రం లోపు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఒక ఎంపీకి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇస్తున్నారా? అని జైళ్ల శాఖను కోర్టు ప్రశ్నించగా.. ఇస్తున్నామన్న అధికారులు సమాధానం ఇచ్చారు. చట్టాలు చేసే వారికి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇవ్వాలి కదా అని కోర్టు పేర్కొంది. కోర్టు ఆదేశాలు ఇస్తే వాటిని అమలు చేస్తామని జైలు అధికారులు తెలిపారు.
ఎంపీ మిథున్ రెడ్డికి రాజమండ్రి సెంట్రల్ జైలులో స్నేహ బ్లాక్‌లో వసతులు కేటాయించామని జైలు శాఖ అధికారి కోర్టుకు తెలిపారు. అక్కడ సరైన సదుపాయాలు లేవని మిథున్ రెడ్డి లాయర్లు తెలిపారు. కోర్టు ఆదేశాలు ఇస్తే అన్ని సదుపాయాలు కల్పిస్తామని జైలు శాఖ అధికారి బదులిచ్చారు. ఈరోజు సాయంత్రం లోపు తీర్పు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.
Also Read: Gold Rate Today: అయ్యబాబోయ్.. బెంబేలేత్తిస్తున్న బంగారం ధరలు! కొనడం కష్టమే ఇగ
దాదాపు పది రకాల సదుపాయాలు కోరుతూ కోర్టులో ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ వేశారు. రాజమండ్రి కేంద్ర కారాగారంలో టీవీ, బెడ్, వెస్ట్రన్ కమోడ్, మూడు పూటలా బయట నుంచి భోజనం, మంచం, దోమ తెర, యోగ మ్యాట్, వాకింగ్ షూస్, వార్త పత్రికలు ఎంపీకి ఇవ్వాలని జైలు అధికారులకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఒక పర్యవేక్షకుడు, ఇద్దరు లాయర్లతో ప్రైవసీతో కూడిన సమావేశాలు వారానికి ఐదు రోజులు, రెగ్యులర్ మెడిసిన్, నోట్ బుక్స్, పెన్‌లు సమకూర్చాలని పేర్కొంది.
మూడు రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఎంపీ మిధున్ రెడ్డికి ఈవేళ నుండి ములాఖత్‌లకు అనుమతి ఇచ్చారు. న్యాయవాది సాదిక్ హుస్సేన్ జైలులోకి వెళ్లి మిధున్ రెడ్డిని కలిశారు. వై కేటగిరీలో ఉన్న మిధున్ రెడ్డికి కోర్టు ఆదేశాల మేరకు ఇంకా ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదని అన్నారు. జైలు అధికారులకు కోర్టు ఆర్డర్ కాపీ అందలేదని, అందిన తర్వాత సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారని తెలియజేశారు.
