shocking crime: ఉల్లిగడ్డల పంచాయతీ ఇంత ఘోరానికి దారి తీస్తుందని ఎవరూ కూడా ఊహించి ఉండరు. ఈ లొల్లి కారణంగా ఓ కొడుకు తన తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ షాకింగ్ ఘటన
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో వెలుగుచూసింది. తక్కువ ధరకు ఉల్లిగడ్డలు ఎందుకు అమ్మావని తన కొడుకును అడిగినందుకు ఓ తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులు ఉన్నారు. వెంటనే వాళ్లు ఆ పెద్దాయనకు అంటుకున్న మంటలను ఆర్పివేసి, ఆస్పత్రికి తరలించారు. అసలు ఏంటీ ఉల్లి పంచాయతీ, ప్రస్తుతం ఆ పెద్దాయన పరిస్థితి ఏంటనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
Read Also: Railway Luggage Rule: రైల్వే ప్రయాణికుల అదనపు లగేజీపై ఛార్జీలు.. క్లారిటీ ఇచ్చిన రైల్వే మంత్రి
10 బస్తాలతో వెళ్లి.. 5 బస్తాలతో వచ్చాడు..
బద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాఫ్లా గ్రామానికి చెందిన రాజేంద్ర సింగ్.. హడా ధార్ జిల్లాలోని బద్నావర్‌కు ఉల్లిగడ్డలు అమ్మడానికి వెళ్లాడు. అతను తనతో 10 బస్తాల ఉల్లిగడ్డలు తీసుకొని వెళ్లి, తిరిగి ఐదు బస్తాల ఉల్లిగడ్డలతో ఇంటికి వచ్చాడు. దీంతో అతని తండ్రి భూరే సింగ్.. కొడుకుతో ఉల్లిగడ్డల ధర ఎంతని అడిగాడు. దానికి రాజేంద్ర సింగ్ చాలా తక్కువ అని చెప్పాడు. తక్కువ ధర ఉన్నప్పుడు మార్కెట్లో ఉల్లిగడ్డలు అమ్మడంపై భూరే సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన కొడుకు రాజేంద్ర సింగ్ ప్లాస్టిక్ బాటిల్ నుంచి పెట్రోల్ తీసి తన తండ్రి ముఖంపై పోసి నిప్పంటించాడు. ఒక్కసారిగా భూరే సింగ్ అరుపులతో ఇంట్లో కలకలం రేగింది. అతని భార్య చందాబాయి, మనవరాలు వెంటనే భూరేసింగ్‌కు దుప్పటి సహాయంతో మంటలను ఆర్పివేశారు. ఈక్రమంలో రాజేంద్ర సింగ్ వారిని కూడా తగలబెట్టడానికి ప్రయత్నిస్తుండగా, గ్రామస్థులు వచ్చి అడ్డుకున్నారు. వెంటనే వీళ్లిద్దరూ గ్రామస్థుల సహాయంతో భూరే సింగ్‌ను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
భూరే సింగ్ భార్య చందాబాయి ఫిర్యాదు మేరకు కుమారుడు రాజేంద్ర సింగ్ హడాపై కేసు నమోదు చేసినట్లు బద్‌నగర్ పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపారు. నిందితుడు రాజేంద్ర సింగ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి, జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. రాజేంద్ర సింగ్ నేరచరిత్ర కలిగిన వ్యక్తి అని, అతనిపై గతంలో కూడా పలు కేసు నమోదు అయ్యాయని పోలీసులు తెలిపారు.
Read Also: TVK rally tragedy: టీవీకే సభలో ఘోరం.. స్పృహతప్పి పడిపోయిన 400 మంది కార్యకర్తలు.. పలువురు మృతి
