NTV Telugu Site icon

MP Bharat Ram: ఎంత దిగజారడానికైనా సిద్ధపడే క్యారెక్టర్ చంద్రబాబుది!

Chandrababu Naidu Sad

Chandrababu Naidu Sad

దేశంలో ఎంత దిగజారడానికైనా సిద్ధపడే క్యారెక్టర్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడిది అని ఎంపీ భరత్ రామ్ విమర్శించారు. గతంలో ప్రశాంత్ కిషోర్‌ను చంద్రబాబు బిహారి గుండా అన్నారు, డెకాయిట్‌గా వర్ణించారు.. ఇప్పుడు నారా లోకేష్ ప్రత్యేక విమానంలో ప్రశాంత్ కిషోర్‌ను బాబు వద్దకు తీసుకొచ్చాడు అని ఎద్దేవా చేశాడు. చంద్రబాబు పొరపాటున అధికారంలోకి వస్తే.. ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు కాదు అని ఎంపీ భరత్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ భరత్ మాట్లాడారు.

‘చంద్రబాబు ఏజెండా ఏంటి?. దేశంలో ఎంత దిగజారడానికైనా సిద్ధపడే క్యారెక్టర్ చంద్రబాబుది. గతంలో ప్రశాంత్ కిషోర్‌ను చంద్రబాబు బిహారి గుండా అన్నాడు.. డెకాయిట్‌గా వర్ణించాడు. ఇప్పుడు లోకేష్ ప్రత్యేక విమానంలో ప్రశాంత్ కిషోర్‌ను చంద్రబాబు వద్దకు తీసుకొచ్చాడు. రాజకీయాల గురించి, పదవులు గురించి, అధికారం గురించి‌ ఎంత నీచానికైనా చంద్రబాబు దిగజారిపోతారో ఈ విషయం ప్రూవ్ చేస్తుంది. ప్రజలు దీన్ని గమనించాలి. రాష్ట్రానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి శిఖండులు అవసరమా?. భవిష్యత్తుకు గ్యారెంటీ అంటున్నారు?, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం గ్యారెంటీ ఇస్తారు?’ అని ఎంపీ భరత్ ప్రశ్నించారు.

Also Read: Vangaveeti Ranga Death Anniversary: వంగవీటి రంగా వర్ధంతి వేడుకలకు దూరంగా రాధా!

‘డిబీటి ద్వారా నేరుగా సీఎం జగన్ జనానికి అందిస్తున్నారు. చంద్రబాబు పొరపాటున అధికారంలోకి వస్తే ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు కాదు.. అన్ని రద్దు చేసేస్తాడు. ఆఫీసర్లకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి.. ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఏంటని చంద్రబాబు అడిగాడు. మరి బాబు చంద్రగిరి నుంచి కుప్పానికి రాలేదా?, హైదరాబాదులో ఉండే లోకేష్ మంగళగిరిలో పోటీ చేయలేదా?, దత్తపుత్రుడు ఎక్కడెక్కడ నుంచి పోటీ చేశాడో చంద్రబాబుకు తెలియదా?. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేందుకు సీఎం జగన్ ఆడుదాం ఆంధ్రాను ప్రారంభించారు’ అని ఎంపీ భరత్ రామ్ చెప్పారు.

Show comments