ఢిల్లీలో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇప్పటికే పలు రహదారుల్లో వరద నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు యమునా నది వరద ప్రవాహం పొంచి ఉండటంతో.. ఢిల్లీ వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టినప్పటికీ.. ఢిల్లీలో వరద ప్రవాహం కొనసాగుతుంది. మరోవైపు దేశ రాజధానిలో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. అంతేకాకుండా రేపు, ఎల్లుండి మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశముంది.
Sai Dharam Tej : ఆ సీనియర్ హీరోయిన్ తో కలిసి చిందేసిన సాయి ధరమ్ తేజ్..
ఢిల్లీలోని పలు కాలనీల్లో ఎక్కడిక్కడ వరద నీరు పేరుకుపోయింది. దీంతో పాత భవనాలు కుప్పకూలుతున్నాయి. తాజాగా పంజాబీ బాగ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ భవనం బాల్కనీ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో శిథిలాల కింద చిక్కుకుపోయి తల్లీ కొడుకు మృతిచెందారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయాలతో బయటపడ్డారు. అయితే భవనం పాతది కావడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు పాత బిల్డింగ్ లలో ఉండొద్దని.. అవి కూలిపోయే ప్రమాదం ఉందని ఢిల్లీ అధికారులు చెబుతున్నారు.