Site icon NTV Telugu

Couples Viral video: పెళ్లిలో ప్రీ వెడ్డింగ్ వీడియో.. తమ డాన్స్‌నే చూసి తెగ నవ్వుకున్న వధూవరులు!

Couples Viral Video

Couples Viral Video

New Couples Pre Wedding Shoot Dance Video: ఇటీవలి కాలంలో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లకు ఆదరణ భారీగా పెరిగింది. పెళ్లికి ముందు ప్రతి ఒక్కరు భారీ స్థాయిలో ప్రీ వెడ్డింగ్‌ ప్లాన్ చేసుకుంటున్నారు. అందమైన ప్రదేశాల్లో కాబోయే వధూవరులు ఫొటోస్ దిగుతున్నారు. అంతేకాదు డాన్స్‌లు చేస్తూ వీడియోలు తీయించుకుంటున్నారు. ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లను పెళ్లి రోజున బంధువులు, అతిథిలు చూస్తూ తెగ ఎంజయ్ చేస్తున్నారు. అయితే ఓ కొత్త జంట తమ డాన్స్‌నే చూసి తెగ నవ్వుకున్నారు.

ఇటీవల తమిళనాడులో ఓ పెళ్లి జరిగింది. పెళ్లి అనంతరం నూతన వధూవరులు తమ ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియోను చూస్తున్నారు. ఈ క్రమంలో వధువు ఒక్కసారిగా పగలబడి నవ్వుకుంది. ఇది చుసిన వరుడు కూడా చేతులు అడ్డుపెట్టుకుని తెగ నవ్వుకున్నాడు. ఇందుకు కారణం లావుగా ఉన్న వరుడు డాన్స్ చేసేందుకు ఇబ్బంది పడడమే. సినిమాటిక్ షాట్స్ కోసం సముద్రం ఒడ్డున వధూవరులు సాంగ్‌కు డాన్స్ చేశారు. వరుడు డాన్స్ చేసేందుకు ఇబ్బందిపడడం.. వధువుకు యాక్టింగ్ కొత్త కావడంతో అందరికీ నవ్వొచ్చింది. వీడియోలో నటన చూసుకుని వధూవరులు ఇద్దరూ తెగ నవ్వుకున్నారు.

Also Read: Fish Viral video: రైలు కాదు.. పట్టాలపై తిరుగుతున్న చేపలు! వీడియో వైరల్

నూతన వధూవరులకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో 90 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది. అదే సమయంలో కామెంట్ల వర్షం కూడా కురుస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘జంట చూడముచ్చటగా ఉంది’ అంటూ కొందరు కామెంట్స్ చేశారు. పలు ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. వీడియో చూస్తే మీరు కూడా హాయిగా నవ్వుకుంటారు.

Exit mobile version