NTV Telugu Site icon

Moon Drifting Away: భూమికి దూరంగా వెళ్తున్న చంద్రుడు.. రోజుకు 25 గంటలే..!

Moon

Moon

చంద్రుడు లేకుండా భూమిపై జీవుల ఉనికిపై చాలా దూర ప్రభావాలను కలిగి ఉండవచ్చు. చంద్రుడు మన భూమికి దూరంగా వెళ్తున్నాడని శాస్త్రీయ అధ్యయనంలో పేర్కొన్నారు. చంద్రుడు సంవత్సరానికి దాదాపు 3.8 సెంటీమీటర్ల చొప్పున దూరం కదులుతున్నాడు. ఇదే ట్రెండ్ కొనసాగితే భూమిపై ఒక రోజు 25 గంటలు ఉంటుంది. 1.4 బిలియన్ సంవత్సరాల క్రితం, భూమిపై ఒక రోజు అంటే 18 గంటల కంటే కొంచెం ఎక్కువగా ఉండేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Diabetes : ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్‌ అవ్వండి..!

యూనివర్శిటీ ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్‌కు చెందిన ఒక బృందం.. భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రునిలో జరుగుతున్న మార్పులపై పరిశోధన నివేదికను విడుదల చేసింది. పరిశోధనా బృందం 90 మిలియన్ సంవత్సరాల పురాతనమైన రాతి నిర్మాణంపై దృష్టి సారించింది. ఇది భూమి నుంచి చంద్రుని మధ్య జరుగుతున్న డ్రిఫ్టింగ్‌ను గుర్తించగలదు. నివేదిక ప్రకారం.. చంద్రుడు భూమి నుండి సంవత్సరానికి 3.8 సెంటీమీటర్ల చొప్పున దూరంగా కదులుతున్నాడు. ఇది భూమిపై రోజుల నిడివిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ట్రెండ్ కొనసాగితే, 200 మిలియన్ సంవత్సరాలలో భూమి యొక్క రోజులు 25 గంటల వరకు ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

Minister Seethakka: ములుగులో పరిశ్రమ ఏర్పాటు చేస్తాం..

శాస్త్రవేత్తల నివేదికల ప్రకారం.. సుమారు 1.4 బిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై ఒక రోజు 18 గంటల కంటే కొంచెం ఎక్కువ ఉండేది. భూమి చుట్టూ చంద్రుడు తిరగడం వల్ల రాత్రింబవళ్లు ఏర్పడుతున్నాయి. ఒకరాత్రి, ఒక పగలును రోజుగా భావిస్తున్నాం. చంద్రుడి పరిభ్రమణ సమయాన్ని బట్టి ప్రస్తుతం రోజుకు 24 గంటలుగా కాలమానం సెట్ చేయబడింది. అయితే భవిష్యత్ లో ఈ కాలమానం మారిపోయి, 25 గంటలు నిడివి కలిగిన రోజు వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయంలో జియోసైన్స్ ప్రొఫెసర్ స్టీఫెన్ మేయర్స్ ఏమన్నారంటే.. ‘చంద్రుడు దూరంగా కదులుతున్నప్పుడు భూమి స్పిన్నింగ్ ఫిగర్ స్కేటర్ లాగా ఉంటుంది’ అని అన్నారు. చాలా పురాతన భౌగోళిక సమయ ప్రమాణాలను అభివృద్ధి చేయడానికి ఖగోళ శాస్త్రాన్ని ఉపయోగించడం మా ఆశయాలలో ఒకటి. మేము అధ్యయనం చేసే విధానంతో పోల్చదగిన విధంగా బిలియన్ల సంవత్సరాల పురాతనమైన శిలలను అధ్యయనం చేయాలనుకుంటున్నాం. ఇవి ఆధునిక భౌగోళిక ప్రక్రియలు’ అని తెలిపారు.