Site icon NTV Telugu

Moinabad News: నేను జాతీయ జెండా ఎగురవేయను.. కమిషనర్ ఖాజా మొండిపట్టు..

Moyinabad

Moyinabad

Moinabad News: దేశ ఐక్యతకు చిహ్నం జాతీయ జెండా.. ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా ఎగరాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగిరింది. కానీ.. ఓ ప్రభుత్వ కార్యాలయంలో మాత్రం మధ్యాహ్నం పన్నెండు అయినా జెండా ఎగరలేదు. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు.

READ MORE: Bengaluru cylinder blast: బెంగళూరులో విషాదం.. పదేళ్ల బాలుడు మృతి.. తీవ్రంగా దెబ్బతిన్న ఇళ్లు

అసలు ఏం జరిగిందంటే.. మొయినాబాద్ చిలుకూరు మున్సిపల్ కార్యాలయం వద్ద గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం వద్ద జెండా ఎగరవేయడానికి కమిషనర్ ఖాజా మొయినుద్దీన్ నిరాకరించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించడానికి కమిషనర్ ఖాజా మొయినుద్దీన్ నిరాకరించారు. 12 గంటలైన మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో జెండా ఎగరవేయకపోవడంతో కమిషనర్‌ని గ్రామస్థులు నిలదీశారు. దీంతో కమిషనర్ ఖాజా మొయినుద్దీన్‌కు గ్రామస్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. జాతీయ జెండాను అవమానించడం, జెండా ఎగరవేయకపోవడంపై ఉన్నతాధికారులు స్పందించి కమిషనర్ ను సస్పెండ్ చేయాలని గ్రామస్థుల డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version