Site icon NTV Telugu

Malaikottai Vaaliban : మోహన్ లాల్ మలైకొట్టాయ్ వాలిబన్ ట్రైలర్ వచ్చేసింది..

Whatsapp Image 2024 01 18 At 11.05.45 Pm

Whatsapp Image 2024 01 18 At 11.05.45 Pm

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మలైకొట్టాయ్ వాలిబన్. ఈ మూవీలో మోహన్ లాల్ పవర్ ఫుల్ రెజ్లర్ పాత్రలో కనిపించబోతున్నాడు.తాజాగా మలైకొట్టాయ్ వాలిబన్ మూవీ ట్రైలర్ గురువారం (జనవరి 18) న రిలీజైంది. లిజో జోస్ పెల్లిస్సెరీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మోహన్ లాల్ లుక్ లీక్ కాకుండా మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.గత నెలలో ఈ మూవీ టీజర్ రిలీజవడంతో ఇందులో ఓ పవర్ ఫుల్ రెజ్లర్ గా మోహన్ లాల్ కనిపించబోతున్నట్లు తెలిసింది.. ఇక తాజాగా మలైకొట్టాయ్ వాలిబన్ మూవీ ట్రైలర్ కూడా వచ్చేసింది. బ్రిటీష్ వారి నుంచి స్వాతంత్ర్యం కోసం ఓ ప్రాంతం చేస్తున్న పోరాటాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు.63 ఏళ్ల వయసులో కూడా మోహన్ లాల్ ఓ పవర్ ఫుల్ రెజ్లర్ పాత్రలో కనిపించడం విశేషం.ఈ మూవీ కోసం మోహన్ లాల్ మేకోవర్ కూడా అద్భుతమనే చెప్పాలి.

విజయాన్ని మించిన ఆనందం మరొకటి లేదు. నేను ఆ ఆనందంలో మునిగిపోయాను. కానీ అందులోనే నమ్మకద్రోహం ఉందని తెలుసుకోలేకపోయాను. నిన్ను నువ్వు మైమరచిపోయినప్పుడు ద్రోహానికి గురి కావడం సహజమే. ఇప్పుడు మంగోడు బరిలో మోసం తప్ప క్రీడాస్ఫూర్తి లేదు. అక్కడంతా రక్తం, కన్నీళ్లే. ఆ కన్నీళ్ల నుంచే సముద్రం పుట్టుకొస్తుంది. ఆ సముద్రం లోతుల్లో నుంచే మండే సూర్యుడు ఉద్బవిస్తాడు” అనే పవర్ ఫుల్ డైలాగులతో ఈ ట్రైలర్ మొదలవుతుంది.ఆ తర్వాత సీన్ లోకి మోహన్ లాల్ ఎంట్రీ ఇస్తాడు.మోహన్ లాల్ ఇంటెన్స్ లుక్ మూవీపై అంచనాలు పెంచేస్తోంది. ఈ సినిమా గురువారమే (జనవరి 18) సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. ఈ మూవీకి యూఏ సర్టిఫికెట్ లభించగా.. మూవీ రన్ టైమ్ 155 నిమిషాలు (2 గంటల 35 నిమిషాలు)గా ఉంది. ఈ సినిమా చూసేందుకు థియేటర్లోకి వచ్చే ఫ్యాన్స్ అసలు నిరాశ చెందరని మోహన్ లాల్ తెలిపారు. ఇలాంటి జానర్ లో ఇప్పటి వరకూ ఇండియన్ సినిమాలో ఎలాంటి మూవీ రాలేదు . మలైకొట్టాయ్ వాలిబన్ మూవీని భారీస్థాయిలో నిర్మించాం. థియేటర్లోకి ఓపెన్ మైండ్ తో వచ్చే ప్రేక్షకులు నిరాశ చెందరు” అని మోహన్ లాల్ అన్నారు. జనవరి 25న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Exit mobile version