Site icon NTV Telugu

Mohan Babu: మంచు ఫ్యామిలీలో మరో ట్విస్ట్.. ఇంటి నుంచి మనోజ్ ను బయటకు పంపాలని ఫిర్యాదు!

Manchu Family Twist

Manchu Family Twist

ఇప్పటికే మీడియాలో సంచలనంగా మారిన మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో మరో ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. తన ఆస్తుల్లో ఉన్నవారిని ఖాళీ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్‌కి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్‌పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని మోహన్ బాబు చేఇస్నా ఫిర్యాదులో ఉంది. వాళ్లను ఖాళీ చేయించి ఆస్తులను తమకు అప్పగించాలని మోహన్ బాబు ఫిర్యాదులో కోరారు. హైదరాబాదు జల్‌పల్లిలోని నివాసం వద్ద హైడ్రామా జరిగిన తరువాత మోహన్ బాబు లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తున్నారు.

Identity: తెలుగులోకి మలయాళ థ్రిల్లర్ ‘ఐడెంటిటీ’

అప్పటి నుంచి కొన్ని రోజులుగా తిరుపతిలో ఉంటున్నారు మోహన్ బాబు. ఇక జల్‌పల్లి నివాసంలో మంచు మనోజ్, తన భార్య పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఇక సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను తనకు వచ్చేలా చూడాలని మోహన్ బాబు ఫిర్యాదులో కోరారు. ఇక తాజాగా మోహన్ బాబు ఆస్తులపై పోలీసుల నుంచి నివేదిక తీసుకున్న కలెక్టర్ జల్‌పల్లి ఇంటిలో ఉంటున్న మనోజ్‌కు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ అంశం మీద మనోజ్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సి ఉంది.

Exit mobile version