విజయవాడలో ‘కన్నప్ప’ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. నాగ సాధువులతో కలిసి నటుడు మోహన్ బాబు వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. “కన్నప్ప సినిమాను గొప్పగా ఆదరిస్తున్నారు.ప్రతీ చోటా కన్నప్పకి మంచి స్పందన వస్తోంది. విష్ణు నటనను అందరూ కొనియాడుతున్నారు. విజయవాడలో సోదరుడు గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో షోను నిర్వహించారు. నాగ సాధువులు, సాధువులు, యోగినిలు, అఘోరాలతో కలిసి మరోసారి సినిమాను వీక్షించడం ఆనందంగా ఉంది.” అని వెల్లడించారు.
READ MORE: KP Sharma Oli: శ్రీ రాముడు, శివుడు మా దేశంలోనే జన్మించారు.. నేపాల్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు..
కాగా.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన కన్నప్ప మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా ఆడుతోంది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్లు ఇందులో నటించడంతో వారి ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎన్నో అంచనాల నడుమ వచ్చింది కన్నప్ప. ఈ మూవీ మొదటి రోజు మొదటి రోజు రూ. 9.35 కోట్లు వసూలు చేసింది. ఇందులో తెలుగు నాటనే ఎక్కువగా కలెక్ట్ చేసింది.
READ MORE: KP Sharma Oli: శ్రీ రాముడు, శివుడు మా దేశంలోనే జన్మించారు.. నేపాల్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు..
