Site icon NTV Telugu

MLA Raja Singh: 11 ఏళ్లుగా బీజేపీ నేతలు నాతో ఫుట్ బాల్ ఆడుకున్నారు..

Rajasingh

Rajasingh

ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 11 ఏళ్లుగా నాతో బీజేపీ నేతలు ఫుట్ బాల్ ఆడుకున్నారు. ఎంత బాధ అయి ఉంటే కొండ విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ అగ్ర నాయకులకు ఫుట్ బాల్ గిఫ్ట్ ఇస్తారు? అని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో మరింత మంది ఎంపీ ఎమ్మెల్యేలు, జిల్లా ముఖ్య నాయకులు ఇదే మాదిరిగా పార్టీ నేతలకు ఫుట్ బాల్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయం అని అన్నారు. కొండ విశ్వేశ్వర్ రెడ్డి మంచి నాయకుడు భారీ మెజార్టీతో గెలిచిన వ్యక్తి.. అటువంటి వ్యక్తి పార్లమెంట్లో మీ వ్యక్తులను పెట్టి ఆయన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? అని ప్రశ్నించారు.

Also Read:Case Filed On TVK Chief: నటుడు విజయ్కి షాక్.. కేసు పెట్టిన పోలీసులు..

నా అసెంబ్లీ పరిధిలో కూడా కిషన్ రెడ్డి మనుషులను పెట్టి నన్ను ఇబ్బంది పెట్టారు.. కిషన్ రెడ్డికి నా ఏరియాలో పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? దీనిపై బీజేపీ జాతీయ నాయకత్వం ఒక్కసారి రివ్యూ చేయాలి.. మాకు బిఆర్ఎస్, కాంగ్రెస్ తో పోటీ కాదు.. మా నాయకులతో మేమే కొట్లాడాల్సిన పరిస్థితి తెలంగాణ బీజేపీలో ఉంది.. ఇతర పార్టీల మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారని రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అంటున్నారు. ఇది మంచి విషయమే అయినప్పటికీ బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంటి?.. ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదు.. బీజేపీలో ఉన్న కార్యకర్తలకు ఫండ్ ఇచ్చి లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిపించుకుని మంచి నాయకులను తయారు చేస్తే సరిపోతుంది కదా.. బీజేపీ కార్యకర్తలు నిరంతరం పార్టీ కోసం కష్టపడి లేబర్ గానే బతకాలా? అని ఘాటుగా ప్రశ్నించారు.

Exit mobile version